రాజకీయాలు ఎలాంటి బంధాన్ని అయినా చెడకొట్టేస్తాయి అంటారు. ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ చూస్తున్న వారు ఈ విషయాన్ని 100 శాతం అంగీకరిస్తారు. కానీ.., అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
రాజకీయాలు ఎలాంటి బంధాన్ని అయినా చెడకొట్టేస్తాయి అంటారు. ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ చూస్తున్న వారు ఈ విషయాన్ని 100 శాతం అంగీకరిస్తారు. కానీ.., అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్- బీజేపీ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇరు పార్టీలల్లో వలసల జోరు పెరిగింది. అసంతృప్తుల హోరు ఎక్కువ అయ్యింది. ఈ క్రమంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కువ అయ్యాయి. ఇంత రచ్చ జరిగితే నాయకుల మధ్య మంచి వాతావరణం ఎలా ఉంటుంది. ప్రత్యర్ధులు కయ్యానికి కాలు దువ్వే వరకు పరిస్థితి వెళ్లిపోయింది.
ఇలాంటి సమయంలో అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసేలా ఓ సన్నివేశం నెలకొంది. తెలంగాణ అసెంబ్లీలో ఈ గురువారం నుండి వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దగ్గరకు వెళ్లి మరీ, ఆయన్ని ఆలిగినం చేసుకుని, ఆప్యాయంగా పలకరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 10 నిమిషాల కన్నా ఎక్కువ సమయమే వీరిద్దరి సంభాషణ సాగింది. ఒకరినొకరు కౌగిలించుకొని చిరునవ్వుతో మాట్లాడుకోవడంతో అసెంబ్లీలోని మిగతా నాయకులు అంతా ఆశర్యపోయారు. నిజానికి ఈటలకు బీఆర్ఎస్ తో, కేసీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దం పాటు ఆ పార్టీలో ఈటల కీలక నాయకుడిగా పని చేశారు. కొన్ని కారణాలతో బయటకు వచ్చిన ఆయన బీజేపీలో చేరారు.
అయినప్పటికీ కేటీఆర్ పై కూడా ఈటల చాలా ఆప్యాయత చూపించేవారు. అది రాజకీయాలకు అతీతమైన బంధం. కేటీఆర్ ఈ కారణంగానే.. ఈటల పట్ల తన గౌరవాన్ని వదులుకో లేదు. అవకాశం దొరికిన ప్రతిసారి పెద్దాయన్ని కలిసి ఆప్యాయంగా పలకరిస్తూనే ఉన్నారు. ఇక గతంలో బీఆర్ఎస్ నాయకుల నుండి తనకి ప్రాణహాని ఉందని ఈటల దంపతులు కామెంట్స్ చేయగానే.. కేటీఆర్ వెంటనే ఆ విషయంలో అలెర్ట్ అయ్యారు. ఈటల కుటుంబానికి సెక్యూరిటీ పెంచుతూ.. ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈటలకు తానే స్వయంగా భద్రత కల్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. పోటీ రాజకీయం వరకే గాని.. ప్రేమలు, అనుబంధాలు తమ మధ్య అలానే ఉన్నాయని ఈటల, కేటీఆర్ ఎప్పటికప్పుడు నిరూపిస్తూ వస్తున్నారు. మరి.. వీరి కలయికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.