ఇటీవల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు సైతం హార్ట్ స్ట్రోక్‌కు గురౌతున్నారు. చిన్న వయస్సుల వారి నుండి వృద్దుల వరకు దీని బారిన పడుతున్నారు. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు సైతం గుండె పోటుతో మరణించారు. ఉజ్వల భవిష్యత్తున్నయువత దీనికి బాధితులవుతున్నారు. తాజాగా మరో విద్యార్థిని గుండె పోటుకు గురైంది.
దేశంలో ఇంకా అనేక గ్రామాల్లో చీకటిలో మగ్గుతున్నాయి. అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో ఉండిపోతాయి. అలాంటి గ్రామాలకు రోడ్డు, రవాణా మార్గం ఉండదు. కాలి నడక ద్వారానే వారి గ్రామాలకు చేరుకోవాల్సి ఉంటుంది. కనీస సదుపాయాలు లేని గ్రామాలెన్నో. అయితే ఓ పసిపాప కడుపునింపేందుకు ఓ కుగ్రామంలోని ఓ కుటుంబం నానా కష్టాలు పడుతూ వార్తల్లో నిలిచింది.
తెలంగాణ మిల్లెట్ మ్యాన్, డీడీఎస్ వ్యవస్థాపకులు పీవీ సతీష్ (77) ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జీవ వైవిధ్యం, ఆహార సౌర్వ భౌమ త్యం, మహిళా సాధికారికత కోసం ఉద్యమించడంతో పాటు ఎనలేని కృషి చేశారు.
ప్రేమ కోసం పరితపించడం తప్పులేదు కానీ, ప్రేమించలేదన్న అక్కసుతో ప్రాణాలు తీస్తున్నారు కొందరు. ప్రేమ పేరుతో వెంటపడటం లేదంటే మరో వ్యక్తిని ప్రేమిస్తుందన్న కక్షతో వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంచిర్యాలలో ఓ ట్రాన్స్ జెండర్ అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పేపర్ లీకేజ్ ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. ఈ పేపర్ లీకేజ్ అంశం రాష్ట్ర్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా తాము కొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సడెన్ ప్రకటన చేసింది ఓ విద్యా సంస్థ. అయితే పరీక్ష వాయిదా వేయడానికి కారణాలు చెప్పకపోవడంతో పలు అనుమానాలకు తావునిచ్చినట్లయింది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, ఇతర కారణాలతో పెద్ద పెద్ద సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నత స్థాయి నుండి చిన్న స్థాయి ఉద్యోగుల వరకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నవారే. దీంతో ఐటి ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీనికి తోడు కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తీరా అవి బోర్డు తిప్పేసరికి బాధితులు లబోదిబోమంటున్నారు.
టికెట్ లేకుండా రైలు ప్రయాణం నేరం. ఈ విషయం తెలిసి కూడా ఇద్దరు యువకులు రైలు ఎక్కడమే కాదూ.. టికెట్ అడిగినందుకు టికెట్ కలెక్టర్ (టీసీ)పై రుబాబు చేశారు. అతడితో గొడవకు దిగారు. ఇది వివాదం ముదిరి ముదిరి చివరకు దాడి చేసుకునేంత వరకు వెళ్లింది.
విద్యార్థులు చదువుల్ని భారంగా చూస్తున్నారు. సరిగ్గా చదవలేక, మానసిక ఒత్తిడికి గురౌతున్నారు. మార్కుల పేరుతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడి తీసుకురావడం, మందలించడంతో ఇంటర్ విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపాటుకు గురి చేస్తుంది.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో దొొంగలు పడిన విషయం అందరికీ తెలిసిందే. కొంత మంది వ్యక్తులు గత నెల 23న ఆలయంలోకి చొరబడి లక్షలు విలువ చేసే ఆభరణాలను దొంగిలించారు. అయితే ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.