ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు పలు వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటితో 2,300 కి.మీ పూర్తిచేసుకున్నారు.
ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో టీడీపీ యువనేత నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తోన్నారు. ఎన్నో అడ్డంకులు, పోలీస్ ఆంక్షలు, బెదిరింపుల మధ్య ప్రారంభం అయిన యువగళం పాదయాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. నారా లోకేష్ మొదలు పెట్టిన పాదయాత్ర గురువారం పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల వద్ద 2,300 కి.మీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
శుక్రవారం పల్నాడు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతుంది. కాగా, ఈ రోజు పాదయాత్ర బ్రేక్ పడింది. ఆయన మంగళగిరి కోర్టుకు నారా లోకేష్ హాజరయ్యారు. గతంలో ఆయన కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. నారా లోకేష్ వస్తుండటంతో కోర్టు దగ్గరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ను టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఇతర పార్టీ నేతలు కలిశారు. రాష్ట్రంలో యువగళం పాద యాత్రకు మంచి స్పందన వస్తుందని.. కార్యకర్తలో నూతనోత్తేజాన్ని తీసుకువస్తుందని.. ప్రజలు బాగా ఆదరిస్తున్నారని వారు అన్నారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ నుంచి బయలుదేరారు నారా లోకేష్.
నారా లోకేష్ నడుచుకుంటూ వస్తున్న రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉంది. పల్లం వైపు నడుచుకుంటూ వస్తున్న సమయంలో హఠాత్తుగా ఆయన స్లిప్ అయి కిందకు పడిపోబోయారు. వెంటనే ఆయనను సిబ్బంది, కార్యకర్తలు పట్టుకున్నారు. తనకు ఏమీ కాలేదని.. అందరికీ ధైర్యం చెప్పి ముందుకు సాగారు నారా లోకేష్. గతంలో కూడా ఆయనకు పలు సందర్భాల్లో ప్రమాదాలు తృటిలో తప్పిపోయాయి. మొత్తానికి నారా లోకేష్ కి ఏమీ కాకపోవడంతో కార్యకర్తలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.