తెలుగు చిత్ర పరిశ్రమలో రాఘవేంద్రారవుకి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకేంద్రుడిగా గుర్తింపు పొందారు. తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులు అద్దారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలు.. బన్ని వరకు అన్ని జనరేషన్ల హీరోలతో సినిమాలు తీశారు. రాఘవేంద్రరావుకి రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా.. మాజీ సీఎంలు సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. పలు సందర్భాల్లో దాన్ని బయటకు వెల్లడించారు కూడా. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఆయన బలంగా కోరుకుంటారు. తాజాగా ఈ కోరికను మరో సారి వెల్లడించారు దర్శకేంద్రుడు.
ఆదివారం నాడు (జూన్ 26) బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెం గ్రామంలో నందమూరి తారకరామారావు విగ్రహాన్ని దర్శకేంద్రుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు దర్శకేంద్రుడు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ.. వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీదే అని ఆశాభావం వ్యక్తం చేశారు. రోజు రోజుకి తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టడం ఖాయం అని అన్నారు. అన్నగారు ఎన్టీఆర్ సాక్షిగా చెప్తున్నాను.. ఈ వేదిక మీద ఉన్న నాయకులు సంవత్సరన్నర తర్వాత ఉన్నత పదవుల్లో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా తనకి దర్శకుడిగా గుర్తింపు ఇచ్చిన అన్న ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.
ఇది కూడా చదవండి: Amaravati Lands: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకానికి అమరావతి భూములు.. ధర కోట్లలో!
తనకి జన్మ ఇచ్చింది తల్లిదండ్రులు అయితే.. సినిమాల్లో జన్మనిచ్చిందని ఎన్టీఆర్ అని అన్నారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది ఎన్టీఆర్ వల్లేనని.. తన సినీ ప్రయాణం ఎన్టీఆర్ తోనే మొదలు అయ్యిందని అన్నారు. ఎంతమంది హీరోలు ఉన్నా.. ఎన్ని పాత్రలు చేసినా.. ముందు గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ మాత్రమేనని.. ఆయనకి భారతరత్న రాలేదని అనుకుంటున్నారు కానీ.. ఎన్టీఆర్ భారత రత్న కాదు ప్రపంచానికే రత్న అని కొనియాడారు రాఘవేంద్రరావు.
ఇది కూడా చదవండి: YS Jagan: విపక్షాలపై మండి పడ్డ సీఎం జగన్.. ‘అంతా కలిసి నా వెంట్రుక కూడా పీకలేరు’..!
ఇక ఇటీవల టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రచించిన ‘నేను తెలుగుదేశం’ పుస్తక ఆవిష్కరణలోనూ చంద్రబాబు సీఎం కావడం ఖాయం అని అన్నారు రాఘవేంద్రరావు. అడవి రాముడు అయినా.. అయోధ్య రాముడైనా అన్న ఎన్టీఆర్‌గారే అంటూ.. రాముడ్ని రామచంద్రుడు అని కూడా అంటారు.. రాముడు తరువాత ఈ చంద్రుడు (చంద్రబాబు) అంటూ ప్రశంసలు కురిపించారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని.. ఆయన స్టార్ట్ అంటే చాలా తాను యాక్షన్‌లోకి దిగిపోయి ఆ రుణం తీర్చుకుంటానని అన్నారు రాఘవేంద్రరావు. ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: శ్రీవారి సన్నిధిలో హీరో శ్రీకాంత్ కుటుంబం.. వీడియో వైరల్