మెగా కాంపౌండ్ లో చిరంజీవి వేసిన బాటలో అందరూ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే వారి వారసులు కూడా.. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు. అని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
మెగా కాంపౌండ్ లో చిరంజీవి వేసిన బాటలో అందరూ హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే వారి వారసులు కూడా.. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు. అని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో రేణూ దేశాయ్ ప్రతిసారి ఖండిస్తూనే ఉంది. అయితే ఆ మధ్య అడవి శేష్ సినిమాలో నటిస్తాడంటూ ప్రచారం జరిగింది. దాన్ని కూడా ఖండించింది. ఇలా ఎప్పటికప్పుడు అకిరా నందన్ మీద రూమర్లు వస్తూనే ఉంటాయి. కానీ వాటిని రేణూ దేశాయ్ అక్కడికక్కడే ఫుల్ స్టాప్ పెట్టేసింది. అకిరా నందన్ ధ్యాస అంతా కూడా చదువు మీదే ఉంది.. మధ్యలో మ్యూజిక్, ఫుట్ బాల్ అంటూ.. ఇలా నిమిషానికొకసారి తన ఇష్టాలు మారుతుంటాయి.
తాజాగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావుతో అంకిరా నందన ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ముందుగా ఈ ఫోటోను షేర్ చేసిన తర్వాత డిలీట్ చేశారు. కానీ నెట్టింట్లో మాత్రం ఆ ఫోటో అప్పటికే వైరల్ అయింది. దర్శకేంద్రుడితో అకిరా నందన్ కనిపించడంతో సంథింగ్ ఫిషీ అని అంతా అనుకున్నారు. కొంపదీసి దర్శకేంద్రుడితో లాంచ్ చేయిస్తున్నారా? అకిరా నందన్ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారా? అంటూ రేణూ దేశాయ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు.
దీని మీద రేణూ దేశాయ్ స్పందించింది. ఆ రూమర్లకు, కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. రేణూ దేశాయ్ నెటిజన్లు కామెంట్లకు రిప్లై ఇచ్చింది. తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో రిప్లై ఇచ్చింది. అకిరా నందన్ ఏ ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అవ్వలేదు.. అసలు అకిరాకు ఇప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ లేదు.. సినిమాల్లో నటించాలని లేదు.. ఒక వేళ అకిరాకు ఆ ఇంట్రస్ట్ పుడితే.. సినిమాల్లో నటిస్తే.. ఆ విషయాన్ని ముందుగా నేనే ఇన్ స్టాలో ప్రకటిస్తాను అని రేణూ దేశాయ్ చెప్చుకొచ్చింది. ఇక ఫ్యాన్స్ అయితే మా మెగా హీరోని తోందరగా లాంచ్ చేయండి అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరగుతుందో.