వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీలో కలకలం రేపుతుంది. సీబీఐ ఛార్జి షీటు వేయడంతో ఈ అంశం మరింత వేడెక్కింది. అయితే ఈ హత్య కేసు రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతుంది. వివేకా హత్య జరిగి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసు విచారణ సరిగా జరగలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసు విచారణలో ఆలస్యం కారణంగా సీఎం జగన్ కి సొంత జిల్లా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని సమాచారం. మరోవైపు వివేకా కుమార్తె సునీత.. కేసు విచారణలో చోటు చేసుకుంటున్న ఆలస్యంపై బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ అంశంలో జగన్ పై సీరియస్ గా ఉన్న సునీత త్వరలోనే టీడీపీలో చేరతారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆ విషయంలో జగన్ పై ఆగ్రహం..
ఇక తన తండ్రిని దారుణంగా హత్య చేసిన విషయాన్ని వివేకా కుమార్తె సునీత ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేరానికి పాల్పడింది ఎవరైనా సరే.. వారికి శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇందుకుగాను ఆమె తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు స్వయంగా అన్న అయినప్పటికి కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆమెను బాధిస్తోందని సునీత సన్నిహితులు అంటున్నారు.
ఇది కూడా చదవండి : సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారా..?
తండ్రి హత్య జరిగి మూడేళ్లు కావొస్తున్నా.. ఇంకా నిందితులు ఎవరనేది తేలకపోవడంతో సునీత ఆగ్రహంగా ఉన్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును జగన్ సీరియస్ గా తీసుకోవడం లేదని.. అందుకే ఆలస్యం అవుతోందని సునీత భావిస్తున్నారట. జగన్ పై ఆగ్రహంగా ఉన్నా ఆమె.. ఇప్పటికే ఆ కుటుంబంతోనూ పెద్దగా కలవడం లేదని తెలుస్తోంది. మరోవైపు తమ తండ్రిని చంపిన వారికి ఖచ్చితంగా శిక్ష పడేందుకు తాను ఎలాంటి అడుగులు వేయడానికి అయినా సిద్దమని సునీత తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
అవకాశంగా మార్చుకునే ప్రయత్నంలో టీడీపీ..
సీఎం జగన్, అతడి కుటుంబం పట్ల సునీతలో ఉన్న అసంతృప్తిని టీడీపీ అవకాశంగా మార్చుకునేందకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే టీడీపీ ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. కడప జిల్లాలో టీడీపీకి పెద్దగా కేడర్ లేదు. ఏళ్లుగా అక్కడ వైఎస్ కుటుంబం హవానే కొనసాగుతోంది. ఈ క్రమంలో వివేకా కుమార్తె సునీత టీడీపీలో చేరితే పార్టీకి బలం పెరుగుతుంది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది.
ఇది కూడా చదవండి : వరల్డ్ కప్ హీరో, గుంటూరు క్రికెటర్‌కు సీఎం జగన్ నజరానా..
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే.. సునీతను టీడీపీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సునీత మనసులో మాటను కనుక్కునేందుకు ఇప్పటికే కడప జిల్లాకు చెందిన ఒక నేతను ఆమెతో మాట్లాడేందుకు పంపినట్లు సమాచారం. ఇక టీడీపీ ప్రయత్నాలు ఫలించి సునీత టీడీపీలో చేరితే వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బ అని చెప్పకతప్పదు అంటున్నారు విశ్లేషకులు.
కడప నేతలతో చంద్రబాబు భేటీ..
కడపలో చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఆ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. నేతల మధ్య ఐక్యత లేదని ఆయన గట్టిగానే మందలించినట్లు తెలుస్తోంది. జిల్లాలో చోటు చేసుకునే అంశాలను పార్టీకి అనుకూలంగా మార్చే దిశగా ప్రయత్నించాలని సూచించారట. ఒకవేళ టీడీపీ ప్రయత్నాలు ఫలించి.. సునీత ఆ పార్టీలో చేరితే.. వైసీపీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి సునీత టీడీపీలో చేరతారా.. వైసీపీలోనే కొనసాగుతారా చూడాలి అంటున్నారు కార్యకర్తలు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.