ఈ మధ్య ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నారు అంబటి రాయుడు. వచ్చే ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించాలని దృడ సంకల్పంతో ఉన్నారు.
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాలని ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు. రాజకీయాల్లోకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ ఫైనల్ తరువాత క్రికెట్ కు వీడ్కోలు పలికిన అంబటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు అందరు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇతర ఫంక్షన్లలో పాల్గొంటు ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో అమరావతికి వెళ్లిన అంబటిని రైతులు చుట్టుముట్టారు.
స్థానిక వైసీపీ నేతల ఆహ్వానం మేరకు అమరావతిలో పర్యటించారు అంబటి రాయుడు. తుళ్లూరు మండలం వెలగపూడిలో వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న రాజధాని ప్రాంత రైతులు అంబటి రాయుడు వద్దకు చేరుకున్నారు. అంబటిని చుట్టిముట్టి అమరావతికి మద్దతు తెలపాల్సిందిగా రైతులు కోరారు. రాజధాని రైతుల ఉధ్యమానికి అండగా ఉండాలని కోరారు. జై అమరావతి అనాలని అంబటిని కోరగా సున్నితంగ తిరస్కరించాడు. దీక్షా శిభిరానికి వచ్చి తమ సమస్యలను వినాలని రైతులు విన్నవించుకోగా ఈ సారి వచ్చినప్పుడు వస్తానని నచజెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అంబటి రాయుడు.