మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో పర్యటించిన అమిత్ షా అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి కలయిక దేశవ్యాప్తంగానే కాక.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారింది. వీరి భేటీ వెనక గల కారణాలు, ప్రయోజనాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీపై బీజేపీ నేత విష్షువర్థన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. రాబోయే రోజుల్లో పెను సంచలనంగా మారుతుంది అన్నారు. అమిత్‌షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీని బీజేపీ స్వాగతిస్తోంది. యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో పెను మార్పులు ఖాయమన్నారు. పవన్, జూ. ఎన్టీఆర్ ఇద్దర్ని బీజేపీ సమానంగా చూస్తుంది. రాజకీయాలు మాట్లాడకపోయినా తారక్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పుకొచ్చారు. విష్షువర్థన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.