తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా
1999వ సంవత్సరంలో విడుదలైన ఒక తెలుగు సినిమాలోని పాట తెలుగు సినిమా ప్రేక్షక లోకాన్ని ఒక ఊపు ఊపేసింది. అఫ్ కోర్స్ నేటికీ ఆ పాట ప్రేక్షకుల గుండెల్లో భద్రంగా ఉంది. ఆ పాటలో నటించిన హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ ని నేటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అప్పుడే పూచిన లేలేత గులాబి పువ్వులా ఉండే రూపం ఆ హీరోయిన్ సొంతం. వెండి తెరపై అందమైన రూపంతో అందమైన సొగసులని ప్రదర్శించి తనని అభిమానించిన ఎంతో మంది అభిమానుల మోముల్లో వెండి కాంతుల్ని విరజిమ్మిన ఆ హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే ఒక్కసారిగా అందరూ షాకవుతారు. నిజంగా ఆ వెండి వెన్నెలేనా అని ఆశ్చర్యపోతారు.
ప్రీతి జింగానియా.. తమ్ముడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఒక అందాల ముద్దుగుమ్మ. పవన్ కళ్యాణ్ హీరోగా 1999వ సంవత్సరంలో వచ్చిన తమ్ముడు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలోని ‘పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో త్వరగా, అడుగుతావని ఆశగా ఉంది, అడగవేం త్వరగా’ అనే పాటతో ప్రీతి జింగానియా తెలుగు యూత్ మొత్తాన్ని తన మాయలో పడేసుకుంది. పవన్ కళ్యాణ్ ని చిన్నప్పటి నుంచి ప్రేమించే అమ్మాయిగా.. అలాగే పవన్ పై వున్న తన ప్రేమని దాచుకొని అతని అభివృద్ధికి పాటుపడే అమ్మాయిగా ప్రీతి జింగానియా నటించిన విధానం ఎంతో మంది యువతీ యువకుల మనసుని దోచింది.
అలాగే ఆ సినిమాలో ఆమె అందమైన నవ్వుని, అందమైన చూపులు కూడా ఎవరూ మర్చిపోలేరు. నందమూరి బాలకృష్ణతో నరసింహ నాయుడు అనే సినిమాలో కూడా ప్రీతి జింగానియా నటించింది. బాలకృష్ణ ని ఇష్టపడే అమ్మాయిగా నరసింహనాయుడు సినిమాలో సూపర్ గా నటించి భవిష్యత్తులో తెలుగు సినిమా అగ్ర హీరోయిన్ అవుతుందని అనుకునేలా చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో కూడా దేవలోకంలో ఇంద్రుడి దగ్గర ఉండే ముగ్గురు అప్సరసలు రంభ, ఊర్వశి, మేనకలలో ఒకరైన ఊర్వశిగా ప్రీతి నటించింది. ప్రీతి జింగానియా తన సినీ కెరీర్ లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 39 సినిమాలకి పైనే చేసింది.
కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నపుడే ప్రముఖ నటుడు పర్విన్ దబాస్ అనే నటుడ్నిపెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు. ఇంక అసలు విషయంలోకి వస్తే సినిమాలకి దూరమైన ప్రీతి జింగానియా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రీతి జింగానియా ఫొటోస్ ని చూసి చాలా మంది షాక్ కి గురయ్యారు. ఎంతో అందంగా అప్పుడే విరబోసిన గులాబీ పువ్వుల నవనవలాడుతుండే ప్రీతి జింగానియా ముఖం అలా అయిపోయిందేంటని అనుకుంటున్నారు. సాధారణంగా పెళ్లి తర్వాత ఆడపిల్లలు కొంచెం గ్లామర్ కోల్పోతారని తెలుసు కానీ ప్రీతి జింగానియా ఫేస్ మరీ ఇంతలా మారిపోయిందేంటని అనుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రీతి జింగానియా న్యూ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. మీరూ ఒక లుక్ వేయండి.