పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ గబ్బర్ సింగ్ మూవీలో నటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుందంటేనే కాదు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది, పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు అని తెలిసినా కూడా పవన్ అభిమానులతో పాటు సినీ అభిమానుల ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. పవన్ నటించిన సినిమా చూడాలని అభిమానులతో పాటు ప్రతి తెలుగు సినీ అభిమాని కోరుకుంటాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడనే వార్త ఆయన అభిమానుల్లో జోష్ ని నింపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటనకి ఉన్న పవర్ గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. తన నటనకి, స్టైల్ కి ఎంత శక్తి ఉందో.. పవన్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఉండే జనసందోహాన్ని చూస్తే తెలుస్తుంది.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు పైన అవుతున్నా కూడా నేటికీ సినిమా సినిమాకి తన అభిమానుల్ని పెంచుకుంటూ పోవడం పవన్ కళ్యాణ్ కే సొంతం. పవన్ కళ్యాణ్ ఒక పక్కన రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇంకో పక్కన సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 15 రోజులు పవన్ ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రారంభం అయిన విషయం సినీ ప్రేమికులందరికీ తెలిసిన విషయమే. మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ తదుపరి షెడ్యూల్ ని ప్రారంభించింది.
మైత్రి మూవీస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం అవుతున్న ఈ మూవీని డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తుడిచి పెట్టింది. ఒక్క హైదరాబాద్ సిటీ లోనే దాదాపు 20 థియేటర్లలో 50 రోజులు ఆడిందంటే గబ్బర్ సింగ్ సృష్టించిన సునామీని అర్థం చేసుకోవచ్చు. అలాగే 306 సెంటర్లలో 50 రోజులు, 65 సెంటర్లో వంద రోజులు జరుపుకుంది. దీన్ని బట్టి పవన్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ పవర్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇదే మేజిక్ ని రిపీట్ చేయాలని హరీష్ గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ మీద అటు పవర్ స్టార్ అభిమానుల్లోనూ, ఇటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా గబ్బర్ సింగ్ సినిమాని మించి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ని హిట్ చేయాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. 15 రోజులు కంటిన్యూగా జరిగే ఈ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడు.