ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కొద్దిరోజులకే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అది బ్లాక్ బస్టర్ అయినా, నిరాశపరిచిన సినిమా అయినా ఓటిటి స్ట్రీమింగ్ మాత్రం పక్కా. ఇదివరకంటే ఓటిటి వేదికలు లేవు కాబట్టి.. టీవీ ఛానల్స్ లో వచ్చేవరకు వెయిట్ చేసేవారు. ఎప్పుడైతే ఈ ఓటిటిలు అందుబాటులోకి వచ్చాయో.. అప్పటినుండి సినీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే అవసరం లేకుండా కావాల్సిన వినోదం ఓటిటిలోనే లభిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన చిన్న సినిమాల నుండి పాన్ ఇండియా సినిమాల వరకు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి.
ఇక థియేట్రికల్ రిలీజ్ కి ముందే సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటిటిలు సొంతం చేసుకుంటాయి. అలా ఇప్పుడు అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ ఓటిటి హక్కులు కూడా ప్రముఖ ఓటిటి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీ ఊర్వశివో రాక్షసివో. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అల్లు శిరీష్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘విజేత’ ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓటిటి రిలీజ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఊర్వశివో రాక్షసివో సినిమా ఓటిటి హక్కులను రెండు ప్రముఖ సంస్థలు దక్కించుకున్నాయని టాక్. తెలుగు ఓటిటి ఆహాతో పాటు నెట్ ఫ్లిక్స్ వారు కూడా ఊర్వశివో రాక్షసివో మూవీ స్ట్రీమింగ్ రైట్స్ లాక్ చేసుకున్నట్లు సినీవర్గాల సమాచారం. అయితే.. నవంబర్ 4న సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. కాబట్టి.. ఓటిటి రిలీజ్ ఎప్పుడనేది మాత్రం త్వరలోనే తెలియనుంది. కాగా, ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన “ప్యార్ ప్రేమ కాదల్’ మూవీకి అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో!