ఒకప్పుడు సినిమాలంటే థియేటర్స్ లో చూడాలి.. ఆ తర్వాత పండగల టైంలో టీవీలోకి వస్తే అప్పుడు చూడాలి అనే విధంగా ఎదురు చూసేవారు. ఇప్పుడా ట్రెండ్ పోయింది. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక అన్ని భాషల సినిమాలను జనాలు ఆదరించడం మొదలు పెట్టేశారు. మార్చి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలు రెడీ అయిపోయాయి.
ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక అన్ని భాషల సినిమాలను జనాలు ఆదరించడం మొదలు పెట్టేశారు. ఒకప్పుడు సినిమాలంటే థియేటర్స్ లో చూడాలి.. ఆ తర్వాత పండగల టైంలో టీవీలోకి వస్తే అప్పుడు చూడాలి అనే విధంగా ఎదురు చూసేవారు. ఇప్పుడా ట్రెండ్ పోయింది. ఎప్పుడైతే ఓటిటిలు వచ్చేశాయో.. అప్పటినుండి పూర్తిగా సినిమాలు, వెబ్ సిరీస్ లను ఇళ్లల్లో కూర్చునే ఎంజాయ్ చేస్తున్నారు ఆడియెన్స్. అదీగాక ఏ భాషలో సినిమాలైనా ఓటిటిలలో లోకల్ లాంగ్వేజ్ డబ్బింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. కాబట్టి.. ప్రతివారం రిలీజ్ అయ్యే ఓటిటి సినిమాల కోసం ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు జనాలు.
థియేట్రికల్ సినిమాలైనా రెండు రోజులు ఆలస్యంగా చూడొచ్చులే అనుకుంటారేమో గాని.. ఓటిటిలు వచ్చాక ఎనీ టైమ్.. ఎనీ వేర్ ఓటిటి ఉంది కదా అంటున్నారు. ఆల్రెడీ పాపులర్ అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, జీ5 లాంటివి మాత్రమే కాకుండా కొత్తగా ఎన్నో ఓటిటిలు పుట్టుకొచ్చేశాయి. ఇక రిలీజ్ అయిన సినిమాలే కాకుండా డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ చేసేందుకు సినిమాలను సిద్ధం చేస్తున్నాయి. ఇక ఫిబ్రవరి ఎండింగ్ కాబట్టి.. మార్చి మొదటి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలు రెడీ అయిపోయాయి. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు/సిరీస్ లేంటో చూద్దాం!