ఈ రోజుల్లో థియేట్రికల్ సినిమాలకంటే ఓటిటి సినిమాలపై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. థియేట్రికల్ సినిమాలకు వెళ్లాలంటే స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, సినిమాకు పాజిటివ్ బజ్ ఉండాలి. లేదా విడుదలయ్యాక పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఉంది. కానీ.. ఓటిటి సినిమాలకు ఆ అవసరం లేదు. అదీగాక ఓటిటిలో సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, సెలబ్రిటీ షోలు కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు. లాక్ డౌన్ తర్వాత ఈ విషయాన్నీ జనాలు బాగా బుర్రలో పెట్టుకున్నారు. అందుకే ఓటిటి సినిమాల కోసం అంతలా ఎదురు చూస్తున్నారు.
ఇక ప్రతివారం మాదిరే ఈ వారం కూడా ఓటిటిలోకి ఇరవైకి పైగా సినిమాలు, సిరీసులు రిలీజ్ కి రెడీ అయిపోయాయి. ఇదివరకు వారానికి ఇరవై సినిమాలు రిలీజ్ అవ్వడం చూస్తూ వచ్చాము. కానీ.. కొన్నిసార్లు ఒక్కరోజే ఇరవైకి పైగా ఓటిటి సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతుంటాయి. తాజాగా ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటిటిలో స్ట్రీమింగ్ దాదాపు 24 సినిమాలు సిద్ధమయ్యాయి. అయితే.. వీటిలో మన ఇండియన్ సినిమాలతో పాటు హాలీవుడ్, ఇతర దేశాల సినిమాలు కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. మరి ఈ శుక్రవారం అంటే.. నవంబర్ 4న స్ట్రీమింగ్ కాబోతున్న ఆ 24 సినిమాలేంటో చూద్దాం!