కోవిడ్ మహహ్మరి విజృంభణతో మరోమారు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడడం లేదు. పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఐదేళ్ల పిల్లవాడు మాస్క్ పెట్టుకొనివారిని ప్లాస్టిక్ కర్రతో కొడుతూ “తుమ్హారా మాస్క్ కహా హై” అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియో పోలీసుల కంటపడింది. దీంతో పోలీసులు బాలుడిని అభినందించి ఎనర్జీ అందించే కూల్ డ్రింక్స్, స్నాక్స్ ఇచ్చి పంపారు.
హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు చెందిన ఐదేళ్ల అమిత్ భగ్సునాగ్ దేవాలయం వద్ద బెలూన్స్ అమ్ముతుంటాడు. అక్కడ మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్న వారికి అవగాహన కలిస్తుంటాడు. ఓ ప్లాస్టిక్ బ్యాట్ చేతబట్టిన అమిత్ “తుమ్హారా మాస్క్ కహా హై” అంటూ అటుగా వెళ్ళివారిని ప్రశ్నిస్తూ వారిని బ్యాట్ తో నెమ్మదిగా కొట్టాడు. అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. బుడతడి వీడియోకి లక్షల్లో వ్యూస్ వేలల్లో లైక్స్ వచ్చిపడుతున్నాయి.
As #India faces the aftermath of the second wave of #COVID19, a little boy from the streets of #HimachalPradesh, with a mask on but no slippers is scolding & educating tourists that are not wearing a mask or disregarding #COVID safety protocols
📹: @dharamshalalocal (Instagram) pic.twitter.com/icIBpU0zYW
— CNBC-TV18 (@CNBCTV18News) July 7, 2021