పేదింట్లో పెద్ద కష్టం వచ్చిపడింది. తమ కొడుక్కి అరుదైన వ్యాధి రావడంతో కన్నీరుపెడుతున్నారు తల్లిదండ్రులు. వైద్యం చేయించే స్థోమత లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో చిరుత ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అక్కడే ఉన్న భక్తులు గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో విడిచి వెళ్లింది.
ప్రయాణాలు చేస్తున్నప్పుడు లేదా జాతర్లకు పోయినపుడు సాధారణంగా పిల్లలు తప్పిపోతుంటారు. అక్కడున్న జనం రద్దీ దృష్ట్యా కనిపించకుండా పోయి వేరే వేరే ప్రదేశాలకు వెళ్లిపోతారు. ఆ తరువాత తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా ఆచూకి దొరకక, తమ పిల్లల జాడ తెలియక మనోవేధన అనుభవిస్తుంటారు.
సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సమాజంలో గుర్తింపు పొందుతున్నారు. వారికున్న ప్రతిభతో రకరకాల వీడియోలు చేస్తూ ఫేమస్ అయిపోతున్నారు. ఈ క్రమంలో అత్యుత్సాహంతో చేసే కొన్ని రకాల పనులు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.
అమ్మమ్మ కోసం సైకిల్ పై బాలుడు 130 కి.మీ. ప్రయాణం చేశాడు. అది కూడా రాత్రి సమయంలో. ఎలాంటి భయం లేకుండా అమ్మమ్మ ఇంటికి వెళ్లాలన్న దృఢ సంకల్పంతో దాదాపు 24 గంటలు సైకిల్ తొక్కుతూ చేరుకున్నాడు. అయితే మధ్యలో అనుకోని ఘటనతో..
ఇటీవల దేశ వ్యాప్తంగా వీధి కుక్కల స్వైర విహారం కొనసాగుతుంది. పదుల సంఖ్యల్లో వీధి కుక్కల దాడుల్లో గాయపడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ అంబర్ పేట్ చిన్నారి ఘటన మరువక ముందే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వీధికుక్కల దాడుల్లో చిన్నారులు గాయపడ్డారు.. చనిపోయారు.
నాలుగేళ్ళ వయసులో టీవీ చూడడం, ఆట, పాటలు తప్పితే వేరే లోకం తెలియదు పిల్లలకి. కానీ నాలుగేళ్ల వయసులో అరుదైన రికార్డుని సాధించాడో బాబు. ఆ సినిమాలో సుహాస్ చేయలేనటువంటి పనిని ఈ కుర్రాడు నాలుగేళ్ల వయసులో చాలా అవలీలగా చేసేశాడు. ఇంతకే ఆ పని ఏంటి? ఆ వివరాలు మీ కోసం.
ఈ మద్య కొంతమంది డబ్బు కోసం ఎంతటి నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. సొంత, పరాయి అనే తేడా లేకుండా డబ్బుకోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. బంధాలు, బంధుత్వాలు మర్చిపోతున్నారు. సొంతవారినే మోసం చేస్తూ అవసరమైతే చంపడానికైనా సిద్దపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కలు ఒంటరిగా ఉంటున్న చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దారుణంగా దాడులకు తెగబడుతున్నాయి. అంబర్ పేట్ ఘటనలో ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారిని కుక్కలు కిరాతకంగా కొరికి చంపిన విషయం తెలిసిందే. ఈ తరహా కుక్కల దాడులు వరుసగా జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.