పేదింట్లో పెద్ద కష్టం వచ్చిపడింది. తమ కొడుక్కి అరుదైన వ్యాధి రావడంతో కన్నీరుపెడుతున్నారు తల్లిదండ్రులు. వైద్యం చేయించే స్థోమత లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
నిరుపేద కుటుంబాన్ని విధి ఎక్కిరించింది. కొడుకు పుట్టాడన్న సంతోషం ఓ పక్క అయితే అరుదైన వ్యాధితో బాధపడుతన్నాడని తెలిసి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఆ తల్లిదండ్రులు. రెక్కాడితే గాని డొక్కాడని వారు తమ చిన్నారికి వచ్చిన అరుదైన వ్యాధికి వైద్యం చేయించ లేక విలవిలలాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా గోపాల్ పురం మండలం భీమోల్ గ్రామంలో 5 సంవత్సరాల వయసున్న బాబు అరుదైన వ్యాధతో బాధపడుతున్నాడు. ఆ బాబు తల పరిమాణం రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో పాటు విపరీతమైన జ్వరం, జలుబు, ఆస్థమాతో బాబు బాధపడుతున్నాడు. జబ్బును నయం చేయించడం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఉన్నదంతా పోగొట్టుకున్నారు కుటుంబసభ్యులు. ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారి రూ. 20 వేల నుంచి రూ. 30వేల వరకు ఖర్చవుతోందని బాధితులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఏలూరులోని ఆస్తమా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. అక్కడి వైద్యులు బాబుకు సర్జరీ చేయాలని చెబుతున్నారని బాధితులు చెబుతున్నారు. లక్షలు పెట్టి సర్జరీ చేయించే స్థోమత లేని ఆ కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో సుమన్ టీవీ యాజమాన్యం సామాన్యుడితో సుమన్ టీవీ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. బాధితులు వారి కష్టాన్ని సుమన్ టీవీతో పంచుకున్నారు. దీనిలో భాగంగా యాంకర్ రోషన్ దీనికి సంబంధించిన విషయాలను ఎంపీ భరత్ కు వివరించారు. ఈ క్రమంలో ఆ కుటుంబం ధీనస్థితిని తెలుసుకున్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం మంచి ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు ఎంపీ అంగీకరించారు. అసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి బాబుకు అవసరమైన వైద్యాన్ని అందిస్తామని తెలిపారు. బాబు ట్రీట్ మెంట్ కోసం తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాయం చేయాల్సిన దాతలు ఈ క్రింద ఇచ్చిన బ్యాంకు అకౌంట్ కు తమకు తోచిన సాయం అందించాలని కోరుతున్నారు.
అకౌంట్ హోల్డర్ పేరు: గంటా నరసింహ స్వామి
అకౌంట్ నెంబర్: 82460100022512
ఐఎఫ్ సీ కోడ్: BARBOVJGOPU
భ్రాంచ్: గోపాలపురం
బ్యాంక్ : బ్యాంక్ ఆఫ్ బరోడా