మార్కెట్‌లోకి నకిలీ సిగరెట్స్ వచ్చాయి. లోకల్, ఇంపోర్టెడ్ అన్నిటినీ కవర్ చేస్తూ.. ఒరిజినల్ బ్రాండ్స్‌కి ఏమాత్రం తగ్గని విధంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. వాటిని చూసి విజిలెన్స్ అధికారులు సైతం షాక్ అయ్యారు.
‘పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్’ అన్నాడో కవి. ‘సరదా సరదా సిగరెట్టు.. ఇది దొరల్ తాగు భల్ సిగరెట్టు.. పట్టు బట్టి ఒక దమ్ము లాగితే.. స్వర్గానికే ఇది తొలిమెట్టు’ అని ‘రాముడు భీముడు’ లో పాడారు రేలంగి. ‘పెళ్లి తర్వాత సిగరెట్ మానేస్తామని చాలా మంది మగవాళ్లు చెప్తే నమ్మేసి ఆడాళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు’ అనే డైలాగ్ రాశారు పూరి జగన్నాథ్. ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణం కోసం తహతహలాడుతుంటారు కానీ పోతారని తెలిసినా, పెట్టె మీద ఫాంట్ సైజ్ పెంచి ప్రభుత్వాలు హెచ్చరించినా, బొమ్మలతో భయపెట్టినా మానరు చాలామంది. అదేమంటే.. ‘టెన్షన్స్, ఐడియాస్ కోసం, రిలాక్సేషన్, నికోటిన్ నరాలకి ఇంజెక్ట్ అయ్యి ఉంటుంది కదా.. త్వరగా మానలేం’ అంటూ రకరకాల క్రియేటివ్ స్టోరీస్ చెప్తుంటారు.
అసలు పొగతాడమే ప్రాణాంతకం రా నాయనా అంటే అందులోనూ ఈమధ్య మార్కెట్‌లోకి నకిలీ సిగరెట్స్ వచ్చాయి. లోకల్, ఇంపోర్టెడ్ అన్నిటినీ కవర్ చేస్తూ.. ఒరిజినల్ బ్రాండ్స్‌కి ఏమాత్రం తగ్గని విధంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. వాటిని చూసి విజిలెన్స్ అధికారులు సైతం షాక్ అయ్యారు. ఈ నకిలీ సిగరెట్ల రాకెట్‌ను సుమన్ టీవీ వెలుగులోకి తెచ్చింది. ప్యాకెట్స్ మీద ‘పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం’, ‘టుబాకో కాషెస్ పెయిన్‌ఫుల్ డెత్’ అని.. ఇంపోర్టెడ్ వాటి మీద ‘స్మోకర్స్ డై యంగర్’ అని వార్నింగ్ కొటేషన్ ఉంటుంది. ఈ నకిలీ సిగరెట్స్ తయారు చేసిన వారు ఆ ప్రమాద హెచ్చరికను ప్రింట్ చేయడం మర్చిపోయారు. ఈజీగా దొరికి పోయారు.
విశాఖపట్నంలోని డాబా గార్డెన్స్, జపాన్ ప్లాజాలో గల ఓ గోడౌన్‌లో విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో దాదాపు రూ.78 లక్షల విలువైన సరుకు పట్టుబడింది. రకరకాల ఫ్లేవర్స్ కలిగిన నకిలీ సిగరెట్లు, సిగార్స్ బయట పడ్డాయి. సరుకు చెన్నై, బాంబే నుంచి పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. వీటిలో నికోటిన్ శాతం ఎక్కువగా ఉంటుందని, కొన్నిసార్లు మత్తు పదార్థాలు కలిపి అమ్మే అవకాశముందని, యువతను అట్రాక్ట్ చేయడమే వారి టార్గెట్ అని, యూత్ కనుక వీటికి అడిక్ట్ అయితే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌తో పాటు త్వరగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని అధికారులు చెప్తున్నారు.