ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వైరస్‌లా వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ కండ్ల కలక. రోజూ రోజూకు ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం కళ్ల ఆసుపత్రులు.. ఈ పేషంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో భారీ క్యూ కనిపిస్తుంది.
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వైరస్‌లా వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ కండ్ల కలక. రోజూ రోజూకు ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం కళ్ల ఆసుపత్రులు.. ఈ పేషంట్లతో కిటకిటలాడుతున్నాయి. ఆసుపత్రుల్లో భారీ క్యూ కనిపిస్తుంది. వర్షాకాలంలో అధికంగా వ్యాప్తి చెందే ఈ కంటి ఇన్ఫెక్షన్ వల్ల ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు తక్కువ కానీ.. ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువ. సాధారణంగా కండ్ల కలక వచ్చిన వారి కళ్లల్లోకి చూస్తే ఇతరులకు కూడా కళ్ల కలక వస్తుందని అంటుంటారు. కండ్ల కలక అనేది వైరస్ లేదా బ్యాక్టీరియా లేదా ఏదైనా అలర్జీ వల్ల కలుగుతుంది. ఆ సమయంలో కళ్లు ఎర్రగా తేదా పింక్ కలర్లోకి మారుతాయి. దీనినే పింక్ ఐ అని కూడా పిలుస్తారు.
కండ్ల కలక సోకిన వారిలో కళ్లు పుసులు కట్టడం, నీరు కారడం, దురద, మంట, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కండ్లకలక తగ్గేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అలాగే రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచచు. కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా.. వైద్యుల సలహా మేరకు యాంటీ బయోటిక్ ట్రాప్స్ వాడటం మంచిది. కన్ను దురదగా ఉందని చేతులతో నలుపుకోవడం చేయరాదు. టిష్యూలు లేదా మొత్తని ఖర్చీఫ్ వాడాలి. తరచూ మంచి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలక వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వారి వస్తువులను వినియోగించకపోవడం మరీ మంచిది. ఎక్కువ నీరు తాగితూ.. హైడ్రేటెడ్‌గా ఉండండి. ఇక కండ్ల కలక వస్తే.. నల్ల కళ్లద్దాలు పెట్టుకుంటే కాస్త ఉపశమనం కలగవచ్చు. జన సమూహంలోకి కానీ స్విమ్మింగ్ వంటివి చేయరాదు. సాధారణంగా రెండు, మూడు రోజుల్లో కళ్ల కలక తగ్గిపోతుంది. ఇంకా కంటిన్యూ అయితే.. వైద్యుల సూచనలు తీసుకోవడం శ్రేయస్కరం.