మహిళలు అలంకార ప్రియులు. తమ శారీరక సౌందర్యాన్ని కాపాడుకునేందుకు సౌందర్య ఉత్పత్తులను వినియోగించుకున్నట్లే.. తాము ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు, మెళుకువలు తీసుకుంటారు. చీర, కుర్తీ, మిడ్డీ, ఫ్రాక్స్ డ్రెస్ ఏదైనా కంఫర్టబులిటీ చూసుకుంటారు.
మహిళలు అలంకార ప్రియులు. తమ శారీరక సౌందర్యాన్ని కాపాడుకునేందుకు సౌందర్య ఉత్పత్తులను వినియోగించుకున్నట్లే.. తాము ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు, మెళుకువలు తీసుకుంటారు. చీర, కుర్తీ, మిడ్డీ, ఫ్రాక్స్ డ్రెస్ ఏదైనా కంఫర్టబులిటీ చూసుకుంటారు. ఉద్యోగం, వేడుక, బయటకు వెళ్లే సందర్భాన్ని బట్టి వీరు ధరించే దుస్తుల ఎంపిక ఉంటుంది. అయితే ఏ దుస్తులు ధరించినా, లో దుస్తులు లేకుండా మహిళలు రెడీ కావడం అసాధ్యం. శరీర అవయవాలు బహిర్గతంగా కనిపించకుండా.. కప్పి ఉంచుతాయి కాబట్టి ఇన్నర్స్ ధరించడంలో మోహమాటపడరు. అయితే ఇదే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఇన్నర్స్ రోజంతా ధరించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి తెలియక.. అలా శరీరంపై ఉంచుకుని పనులు చేస్తున్నారు.
మహిళలు ఎంత బిజీగా ఉన్నా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి వేళల్లో మహిళలు నైటీలు, చీరలతో నిద్రపోతుంటారు. ఆ సమయంలో కూడా బ్రాను ధరించే నిద్ర పోతుంటారు కొందరు మహిళలు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అవేంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా బ్రాతో నిద్రించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. కచ్చితంగా బ్రా ధరించి పడుకోవాలని భావిస్తే.. స్పోర్ట్ బ్రా వేసుకుని నిద్రించాలని చెబుతున్నారు. అలాగే బ్రా శరీరానికి హత్తుకునే ఉండటం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదట. ఇక బిగుతుగా ఉండే బ్రాలు వేసుకోవడం వల్ల గాలి సరిగా ఆడక.. చర్మ సంబంధిత సమస్యలు, డార్క్ స్పాట్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. రొమ్ము పరిమాణాల్లో కూడా వ్యత్యాసం వచ్చే అవకాశాలూ లేకపోలేదట. అందుకే రాత్రి వేళ్లల్లో వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. బ్రాను తీసేసి పడుకోవడం మంచిదని సూచిస్తున్నారు.