సాధారణంగా దొంగలు దోచుకునేది సామాన్యుల ఇళ్లనే. ఇంట్లో దాచిన విలువైన వస్తువులు, డబ్బు, బంగారంతో పాటు వాహనాలను కూడా చోరీ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఇంటి ముందు, అవసరం నిమిత్తం రోడ్డు పక్కన ఆపిన వాహనాలను కూడా ఎత్తుకెళ్తున్నారు. వీరిని ఏదో ఓ రోజు పోలీసులు పట్టుకోవడం, శిక్షించడం వంటివి తప్పక జరుగుతాయి. ఆ విషయం తెలిసి కూడా వీరు మారరు. సామాన్యుల వస్తువులను దొంగతనం చేస్తేనే.. జైలుకు పంపిస్తారు.. మరి అలాంటిది ఏకంగా పోలీసులు వాహనాన్ని చోరీ చేస్తే.. ఇంకేముంది.. దొరకబట్టి.. మరీ వీర ఉతుకుడు ఉతుకుతారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భార్యను కలవాలని తహతహలాడుతున్న ఓ వ్యక్తి.. ఏకంగా పోలీస్ జీపును దొంగిలించాడు. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్, బస్తీ జిల్లాలోని సోనాపూర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఆదివారం గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా సంక్షేమ,శిశు సంక్షేమ శాఖ మంత్రి బేబీ రాణి మౌర్యతో పాటు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి విజయ్ లక్ష్మీ గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి వస్తుండటంతో.. అక్కడ విధులు నిర్వర్తించేందుకు కొత్వాల్ నగర పోలీసు అధికారి సంజయ్ కుమార్ వెళ్లారు. అయితే జనం భారీగా రావడంతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. జీపు పార్కింగ్ చేసే ఖాళీ కూడా లేకుండా పోయింది.
ఈ క్రమంలో సంజయ్ కుమార్ వాహనం డ్రైవర్ అక్కడకు కొంత దూరంలో రోడ్డు పక్కన జీపుని పార్క్ చేసి ఆ దగ్గర్లోనే సేదతీరుతూ కూర్చున్నాడు. అయితే మంత్రుల పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని చాలా టాక్సీలు ప్రోగ్రామ్ కోసం బుక్ చేయబడ్డాయి. ఫలితంగా సామాన్యులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో పుట్టింట్లో ఉన్న తన భార్యను కలవడానికి వెళదామనుకున్న ముండెర్వా పోలీస్ స్టేషన్ పరిధి ఛపియా లుతావాన్ గ్రామానికి చెందిన హరేంద్ర అనే 30 ఏళ్ల యువకుడు కూడా సోనాపూర్ లో ట్యాక్సీ దొరక్క ఇబ్బంది పడ్డాడు.
ఇది కూడా చదవండి: Srikakulam: భర్త మృతి.. కొడుకే లోకంగా బతికిన తల్లి.. చివరకు బిడ్డకు తలకొరివే పెట్టే పరిస్థితి!
అయితే ఎలాగైనా సరే ఈరోజు వెళ్లి భార్యను కలవాల్సిందే అని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో పోలీసు జీపు రోడ్డు పక్కన ఖాళీగా ఉండటం, దానికే తాళం ఉండటాన్ని గమనించాడు. పోలీసులు, జనం కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా భావించిన హరేంద్ర పోలీస్ జీపును తీసుకుని పరారయ్యాడు. అయితే కొద్దిసేపటి తర్వాత జీవును ఎవరో తీసుకెళ్తున్నారని గమనించిన డ్రైవర్అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే మరో వాహనంలో వెంబడించారు. పోలీసులు వెంట పడుతున్నారనే భయంతో జీపుని వేగంగా పోనిచ్చాడు హరేంద్ర.
ఇది కూడా చదవండి: Khammam: ఖమ్మంలో కిలాడీ లేడీ..! నైస్ గా మాట్లాడి ఐస్ చేస్తుంది! టెంప్ట్ అయ్యారో..!
దీంతో కొంతదూరం వెళ్లేసరికి జీపు అదుపుతప్పి పర్సా క్రాస్‌రోడ్డు ప్రాంతంలో రహదారి పక్కన ఉన్న చెక్కల కుప్పని ఢీకొట్టి జీపు డ్యామేజీ అయింది. అయితే అక్కడి నుంచి పారిపోయేందుకు హరేంద్ర ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని ఆరా తీయగా.. అత్తగారింట్లో ఉన్న భార్యను చూడాలని ట్యాక్సీ కోసం ట్రై చేశాను కానీ.. లభించలేదు. దాంతో ఇలా జీపు వేసుకుని వెళ్లాను అని తెలిపాడు. పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Men: భార్యా బాధితుల వింత పూజలు.. ‘దేవుడా! ఈ భార్యలు 7 సెకన్లు కూడా మాకొద్దు’..