Khammam: ఆస్కార్ నటుల్ని సైతం బీట్ చేసే యాక్టింగ్.. మనుషుల్ని తన మాటల్తో బోల్తా కొట్టించే టాక్టీస్.. సెంటీ మీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకుపోయే చొరవ.. ఇవన్నీ ఓ మహిళలో ఉంటే.. ఆ మహిళ కొంపలు ముంచే కిలేడీ అయితే.. అచ్చం ఖమ్మంకి చెందిన వనితలా ఉంటుంది. ఈ కిలేడీ మనుషుల్ని ఐస్ చేసి నైస్‌గా డబ్బులు గుంజేసింది. లక్ష, పది లక్షలో కాదు.. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు మోసం చేసి పరారైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన మద్దినేని రమేష్, వనిత భార్యాభర్తలు. వీరు ఖమ్మం నగరంలోని బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రమేష్ కాంట్రాక్టులు చేస్తుంటారు. పెట్రోల్ బంకులు సైతం నడుపుతుంటారు. సొంతగా మూడంతస్తుల బిల్డింగ్ ఉన్నప్పటికి దాన్ని అద్దెకు ఇచ్చి.. ఈ దంపతులు ఖరీదైన, రిచ్‌గా ఉండే ఇళ్లలో రెంట్‌కు ఉండేవారు. ఇక చుట్టు పక్కల వాళ్లతో వనిత ఇట్టే కలిసిపోయేది. ఒక్కొక్కరిని టార్గెట్ చేసి తన పథకాన్ని అమలు పరిచేది.
వనిత ఓ రోజు తనతో బాగా మాట్లాడే వ్యక్తి ఇంటికి సడెన్‌గా వెళ్లి.. ‘‘ మేము అర్జెంట్‌గా చుట్టాల ఇంటికి వెళ్తున్నాం. అసలే దొంగల భయం ఎక్కువగా ఉంది. ఈ సూట్‌కేస్‌ను మీ ఇంట్లో పెట్టండి. ఈ సూట్‌కేస్‌ను మీ మీద నమ్మకంతో అప్పగిస్తున్నా. ఎందుకంటే దీనిలో రూ.10లక్షల బంగారం, రూ.3కోట్లు విలువ చేసే ఇంటి పత్రాలు, 60 ఎకరాల భూమి తాలుకా కాగితాలు ఉన్నాయి’’ అంటూ అబద్ధాలు చెప్పేది. వారు అది నిజమని నమ్మి, ఆమెను ఓ బిగ్ షాట్‌లాగా భావించేవారు. అలా ఎవరినైతే నమ్మిస్తుందో.. వారి పట్ల వనిత తన అసలు ప్లాన్‌ను అమలు పరిచేది. కొన్ని రోజుల తర్వాత వారికి ఫోన్ చేసి ‘‘ వదిన గారు! అర్జెంట్‌గా నాకు రూ. 5లక్షలు కావాలి. మాకు వచ్చే డబ్బులు ఇంకా రాలేదు. వడ్డీ ఎంతయినా పర్వాలేదు. డబ్బులు రాగానే తిరిగిచ్చేస్తాను’’ అంటూ నైస్‌గా మాట్లాడుతుంది. ఇలా తన ఇంటి చుట్టు పక్కల ఉన్న వారందరి దగ్గరా డబ్బులు అడిగింది.
ఆమె బిగ్ షాట్ అని భావించిన వారంతా ఏమీ ఆలోచించకుండా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. అందరి దగ్గరి నుంచి మొత్తంగా రూ. 5 కోట్లు వసూలు చేసింది. ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమంటూ వారు ఫోన్ చేస్తే.. అప్పుడు, ఇప్పుడు అంటూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. చివరకు అప్పులోళ్ల ఫోన్లు ఎక్కువవటంతో ఇంటిని ఖాళీ చేసి పరారైంది. ఫోన్‌ను కూడా స్విచ్ఛాఫ్ పెట్టుకుంది. ఇక వనితకు అప్పులు ఇచ్చిన వాళ్లు ఆమె భర్తను నిలదీయగా.. ‘‘ నాకు చెప్పకుండా అంతంత మొత్తం ఎందుకిచ్చారు.. మీ ఖర్మ.. నేనేం చేయలేను’’ అంటూ వారందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. దీంతో చేసే దేమీ లేక వనిత బాధితులంతా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఆమెపై కేసు పెట్టారు. అయితే, ఈ విషయం సివిల్ కోర్టులో తెల్చుకోండని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో బాధితులు సీపీ విష్ణు ఎస్ వారియర్‌ను కలిశారు. తమ డబ్బు ఎగ్గొట్టేందుకు పలువురు రాజకీయ నాయకుల ద్వారా వనిత ఆమె భర్త ప్రయత్నాలు చేస్తున్నారని ఆయనకు తమ గోడును వినిపించారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ బాధితుల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందిస్తూ.. విచారణ చేయాలని టూటౌన్ పోలీసులను ఆదేశించారు. మరి, కోట్లు కొట్టేసిన ఖమ్మం కిలేడీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Emerald Panchamukhi Vinayaka: ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన రూ.25 కోట్ల మరకత వినాయక విగ్రహం