సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో వింతలు, విశేషాలు మన కళ్ల ముందు అవిష్కరిస్తున్నారు. యూట్యూబ్ చూసి ఎంతోమంది ఔత్సాహికులు తమకు తెలియని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు. కొన్ని మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని దుష్ఫలితాలు ఇస్తున్నాయి.
సమాజంలో కొంతమంది తాము చేస్తున్న పని కరెక్ట్ అంటూ మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఎంతమంది చెప్పినా తాము పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లు అన్న చందంగా.. తాము చేస్తున్నదే కరెక్ట్ అంటూ ఇతరుల మాట కొట్టిపడేస్తుంటారు. కొన్నిసార్లు వాటి పరిణామాలు తీవ్రమైన ఫలితాలను ఇవ్వడంతో పశ్చాత్తాప పడుతుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతుంటాయి. అలా ఓ భర్త తన భార్య పట్ల తీసుకున్న నిర్ణయం ఆమె నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదం ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు కృష్ణగిరి జిల్లా పోచంపల్లిలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి ధర్మపురి జిల్లాకి చెందిన మాదేశ్ తో వివాహం జరిగింది. భార్యభర్తలు ఎంతో అన్యోనంగా జీవిస్తున్నారు. మాదేశ్ తనకు ఉన్న పొలంలో సేంద్రియ వ్యవసాయ పద్దతులు అనుసరిస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య లోకనాయకి గర్భం దాల్చిన విషయం తెలుసుకొని సంబరపడ్డాడు. సేంద్రియ విధానాలు అనుసరించి పొలాన్ని సాగు చేసిన విధంగానే తన భార్యకు ఇంగ్లీష్ మందులు వాడకుండా నార్మల్ డెలివరీ జరగాలని భావించాడు. లోకనాయ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి హాస్పిటల్ గడప తొక్కకుండా చూసుకున్నాడు.
ఆమెకు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించలేదు.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఆమె పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలని చెప్పినప్పటికీ వారి మాటలు ఏమాత్రం లేక్కచేయలేదు.. తన భార్య సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని చెబుతూ వచ్చాడు. ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లు, పౌష్టికాహారాన్ని సైతం నిరాకరించారు. ఆమెకు ఆకు కూరలు, గింజలు ఆహారంగా అందించేవాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 22 లోకనాయకికి ప్రసవ నొప్పులు మొదలు అయ్యాయి.. అప్పుడు కూడా ఆస్పత్రి వెళ్లకుండా మాదేశ్ యూట్యూబ్ చూసి ఆమెకు డెలివరీ చేశాడు. సరైన పద్దతి పాటించకపోవడంతో భార్య మగబిడ్డను ప్రసవించి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
భార్య పరిస్థితి విషమించడంతో తప్పదని కన్నియర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్తండాగా మార్గమధ్యలోనే ఆమె కన్నుమూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోచంపల్లి హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త మాదేశ్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిచారు పోలీసులు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.