నేపాల్లో హోటల్, ముగ్గురు భార్యలను మెయిన్ టైన్ చేస్తున్నాడు. భారత్‌లో ఇద్దరు. నేపాల్లో ఓ భార్య ఉంది. ఇండియాలో లెక్కలేనన్నీ ఆస్తులు కూడా ఉన్నాయి. పిల్లలను పేరున్న బడిలో చదివిస్తున్నాడు. అతడో పెద్ద బిజినెస్ మాగ్నేట్ అనుకుంటే పొరపాటు.
నేపాల్లో హోటల్, ముగ్గురు భార్యలను మెయిన్ టైన్ చేస్తున్నాడు. భారత్‌లో ఇద్దరు. నేపాల్లో ఓ భార్య ఉంది. ఇండియాలో లెక్కలేనన్నీ ఆస్తులు కూడా ఉన్నాయి. పిల్లలను పేరున్న బడిలో చదివిస్తున్నాడు. అతడో పెద్ద బిజినెస్ మాగ్నేట్ అనుకుంటే పొరపాటు. కేవలం దొంగతనాలు చేసి.. వీరిని పోషిస్తున్నాడంటే నమ్మశక్యంగా లేకపోవచ్చు కానీ ఇది నిజం. మామూలు దొంగ కాదు.. హై ప్రొఫెల్ దొంగ మరి. అతడిపై 500 దొంగతనాల కేసులున్నాయంటే ఆలోచించండి.. ఎంతంటి పేరు మోసిన థీఫో. ఎంత చాక చక్యంగా తప్పించుకుందామనుకున్న ఎప్పుడోకప్పుడు దొరికిపోవాల్సిందే కదండీ.. అట్లాగే పోలీసులకు చిక్కాడు. విచారణలో అతడు చెప్పిన విషయాలు తెలుసుకుని పోలీసులు సైతం నోరెళ్లబెట్టారంటే ఆలోచించండి మనోడు ఎంత ముదురో.
ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ థీప్ పేరు మనోజ్ చౌబే. అయితే అతడు ఏం చేస్తాడో భార్యలకు తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజ్.. ఢిల్లీలో దొంగతనాలకు పాల్పడుతుంటాడు. అక్కడ రిచ్ ప్రాంతాల్లో ఇళ్లను టార్గెట్ చేస్తూ దోచుకుంటాడు. ఆ డబ్బుతోనే యుపిలో భార్యకు గెస్ట్ హౌస్ కొనుగోలు చేశాడు. అదే ప్రాంతంలో స్థలాన్ని కొనుగోలు చేశాడు. నెలవారీగా రూ. 2 లక్షల అద్దెకు ఆసుపత్రికి లీజుకు ఇచ్చాడు. అలాగే నేపాల్‌లో హోటల్ కూడా నిర్మించాడు. అతనికి లక్నోలో కూడా ఓ ఇల్లు ఉందని.. అతని పిల్లలు రాజధాని నగరంలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుతున్నారట.
అతను 1997లో ఢిల్లీకి వచ్చి క్యాంటీన్‌లో దొంగతనానికి పాల్పడి మొదట పట్టుబడ్డాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు.. కానీ ప్రతిసారీ తప్పించుకున్నాడు.ఈ సారి పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా మోడల్ టౌన్ ప్రాంతంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన మనోజ్.. స్కూటర్‌పై పారిపోతున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. ఈ ద్విచక్ర వాహనం నేపాల్ పౌరుడైన వినోద్ థాపాకు చెందినదని విచారణలో తేలింది. థాపాను విచారించగా, మనోజ్ చౌబే తన సోదరిని నేపాల్‌లో వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. కరవల్ నగర్‌లో అరెస్టు చేసిన చౌబేపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.