కార్పొరేటర్ కూడా పెద్ద పెద్ద బిల్డప్ లు ఇస్తూ సెక్యూరిటీ గార్డులతో హల్ చల్ చేస్తే ఈ రోజుల్లో ఓ రాష్ట్ర మంత్రి అయి ఉండీ ఏమాత్రం బేషజం లేకండా ఓ మంత్రి ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. ఆ మంత్రి ఏదో ఫోటోల కోసం ఈ పనిచేయలేదు. ఆస్పత్రిలో పనిచేసే స్వీపర్ రాకపోవటంతో స్వయంగా మంత్రిగారే క్లీన్ చేసే కర్ర పట్టుకుని ఊడ్చిపడేశారు.
మిజోరాంలో చాలా మంది మంత్రులు కూడా వీఐపీ కల్చర్‌కు దూరంగా సామాన్య జీవితం గడుపుతుంటారు. సామాన్య ప్రజలు ప్రయాణించే బస్సుల్లో, ఫంక్షన్లలో వంటలు వండుతూ ఇలా ప్రజల్లోనే మమేకమై సాదాసీదా లైఫ్ స్టైల్‌తో జీవిస్తున్నారు. 71 సంవత్సరాల మిజోరాం మంత్రి లాల్జిర్లియానాకు, ఆయన భార్య లల్తంగ్‌మావికి మే 11న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతకు ముందే మే 8న ఆయన కుమారుడు కరోనా బారిన పడ్డాడు. మే 12న లాల్జిర్లియానాకు ఉన్నట్టుండి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆయనను, కుటుంబ సభ్యులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంత్రిని రెండు రోజులు ఐసీయూలో ఉంచి చికిత్సనందించిన వైద్యులు ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో కోవిడ్ వార్డుకు తరలించారు.
ప్రస్తుతం తమ కుటుంబం ఆరోగ్యంగానే ఉందని మెడికల్ స్టాఫ్, సిబ్బంది తమను బాగానే చూసుకుంటున్నారని మంత్రి లాల్జిర్లియానా చెప్పారు. మంత్రికి ఆయన భార్యకు కేటాయించిన రూమ్ శుభ్రం చేయడానికి స్వీపర్ రాకపోవడంతో ఆయనే స్వయంగా క్లీన్ చేసే కర్ర పట్టుకుని రూమ్ శుభ్రంగా చేసుకున్నారు. మంత్రి అయి ఉండి మీరే స్వయంగా శుభ్రం చేశారేంటని అడిగితే ఫ్లోర్ మాపింగ్ కొత్తేం కాదు ఇదే ఫస్ట్ టైమ్ చేయలేదు. ఇంట్లో కూడా నేను చాలా సార్లు చేస్తుంటానని నవ్వుతు చెప్పారు లాల్జిర్లియానా. ఆ సమాధానం ఆయనపై మరింత గౌరవాన్ని సోషల్ మీడియాలో మరింత పెంచింది.