ఈ మధ్య ప్రపంచంలో వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రకృతి మనుషులపై పగబట్టిందా అన్న రీతిలో వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపం వల్ల 50 వేల మంది చనిపోయిన విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా ప్రపంచాన్ని భూకంపాలు పట్టిపీడిస్తున్నాయి. ఏ క్షణంలో భూకంపాలు వచ్చి చనిపోతామో అన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియాలో వచ్చిన భూ ప్రళయం జ్ఞాపకం వస్తే వెన్నుల్లో వణుకుపుడుతుంది. ఇటీవల భారత్, ఇండోనేషియా, నేపాల్, పాకిస్థాన్ మరికొన్ని దేశాల్లో వరుస భూకంపాలు రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించింది. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య భూకంపం అనే పదం వినిపిస్తే చాలు భయంతో హడలిపోతున్నారు. ఈ ఏడాది టర్కీ, సిరియాల్లో భూకంప ప్రళయం మిగిల్చిన విషాదం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు దాదాపు 24 గంటల్లో మూడు సార్లు ఇక్కడ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రతగా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. భూకంప కేంద్రం క్యాంప్ బెల్ తీరానికి సుమారు 220 కిలో మీటర్ల దూరంలో.. భూ అంతర్భాగంలో 32 కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారు తెలిపారు. తెల్లవారు జామున భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం మధ్యాహ్నం మొదిసారిగా కంపించింది.. అప్పుడు రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.1 గా నమోదు అయ్యింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి భూమి కంపించింది.. అప్పుడు దీని తీవ్రత 5.3 గా నమోదు అయ్యింది. క్యాంప్‌బెల్ బేలో 4.6 తీవ్రతతో ప్రకపంనలు వచ్చాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం తీవ్రతకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. మిజోరాం లోనూ సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.7 తీవ్రతగా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.
Earthquake of Magnitude:4.6, Occurred on 10-04-2023, 02:26:02 IST, Lat: 8.98 & Long: 94.07, Depth: 32 Km ,Location: 220km N of Campbell Bay, Nicobar island, India for more information Download the BhooKamp App https://t.co/rbEJXZMrZL@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 pic.twitter.com/O32Uq7cXfw
— National Center for Seismology (@NCS_Earthquake) April 9, 2023