నేడు దేశ వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు వీధుల్లో మువ్వన్నెల జెండ రెప రెపలాడింది.
నేడు దేశ వ్యాప్తంగా 77వ స్వతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. యావత్ దేశం మొత్తం స్వతంత్ర వేడుకల్లో మునిగిపోతుంది. వాడవాడలా, ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగిరింది. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతి వీధిలో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. తాజాగా స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్ లో అపశృతి చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్లో అపశృతి చోటుచేసుకుంది.
యావత్ దేశం నేడు 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మధ్యప్రేదశ్ లో అపశృతి చోటు చేసుకుంది. జెండా ఆవిష్కరించిన తర్వాత వందన స్వీకార సమయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. ప్రభురామ్ చౌధరి అకస్మాత్తుగా స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయారు. స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్బంగా ‘హర్ గర్ తిరంగా అభియాన్’ అనే కార్యక్రమంలో భాగంగా సోమవారం త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు పోలీసులు, అధికారులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రభురామ్ చౌధరి స్వయంగా దగ్గరుండి మరీ అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. నేడు పంద్రాగస్టు సందర్బంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి ప్రభురామ్ చౌధరి శుభాకాంక్షలు తెలిపారు. జెండా ఎగురవేసిన తర్వాత గౌరవ వందనం స్వీకరించే సమయంలో ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయారు. వెంటనే సిబ్బంది అలర్ట్ అయి మంత్రిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల సమక్షంలో ఉన్నారని.. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా వేడుకల సందర్భంగా ఇచ్చే ఉపన్యాసంలో కుప్పకూలారు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
रायसेन में परेड सलामी के दौरान चक्कर खा कर गिरे MP के स्वास्थ्य मंत्री Dr. Prabhuram Choudhary। #PrabhuramChoudhary #IndependenceDay2023 #IndependenceDay #raisen #Madhyapradesh #flaghosting @DrPRChoudhary pic.twitter.com/jsLsVYACfk
— New India Live (खबर सातों पहर) (@Newindialive24) August 15, 2023
एमपी विधानसभा के अध्यक्ष गिरीश गौतम को मऊगंज में स्पीच देते हुए आया चक्कर, सुरक्षाकर्मियों ने संभाला @NavbharatTimes #NBTMP #MPNews pic.twitter.com/4VGlyux9Nc
— NBTMadhyapradesh (@NBTMP) August 15, 2023