ఈ మద్య దేశ వ్యాప్తంగా వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు వృద్దులకు, ఊభకాయం ఉన్నవాళ్లకు మాత్రమే ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ వస్తాయని అంటూ ఉండేవారు.. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు తో చనిపోతున్న కేసులు చూస్తున్నాం.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవారు హఠాత్తుగా ఉన్నచోటే కుప్పకూలి చనిపోతున్నారు. చిన్న పెద్దా అనే వయసు తేడా లేకుండా గుండె పోటుతో మరణిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ మద్య కాలంలో టీనేజ్ పిల్లలు, యువతలో గుండెపోటుతో నిండు జీవితాలు అర్థంతరంగా ముగిసిపోతున్నాయి. షటిల్ ఆడుతూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ ఉప్పల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో ఇటీవల వరుస గుండెపోటు మరణాలు ప్రజానీకాన్ని హడలెత్తిస్తున్నాయి. నిత్యం ఎక్కడో అక్కడ వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. హైదరాబాద్ ఉప్పల్ పరిధి రామాంతపూర్ లో ఎండోమెంట్ కాలనీలో షెటిల్ ఆడుతున్న కృష్ణారెడ్డి (46) అనే వ్యక్తి గుండెపోటు రావడంతో అక్కడూ కుప్పకూలిపోయాడు. స్నేహితులు, స్థానికులు వెంటనే ఆయనను హాస్పత్రికి తరలించారు. కృష్ణా రెడ్డిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో ఎంతో సంతోషంగా గడిపిన స్నేహితుడు గుండెపోటుతో చనిపోవడం స్నేహితులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఇటీవల గుండెపోటుతో చనిపోతున్న కేసులు బాగా పెరిగిపోతున్నాయని వైద్యులు అంటున్నారు. ఆ మద్య 16 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ గౌరవ్ గాంధీ గుండెపోటు మరణించారు. గుండెపోటు రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ఎంతోమందికి సలహాలు, సూచనలు ఇచ్చిన ఆయన గుండెపోటుతో మరణించడం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుత జీవన విధానంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్నట్లు వైద్యలు చెబుతున్నారు. ఎక్కవగా పని ఒత్తిడి, వ్యాయామం చేయడం, డ్యాన్స్ లు చేయడం, శక్తికి మించిన పనులు చేయడం లాంటివి చేయడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు. గుండెపోటు సిమిటమ్స్ ఏమైనా అనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.