మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పోలీసులు హెచ్చరిస్తున్నా గానీ కొంతమంది మాత్రం మాట వినడం లేదు. పీకలదాకా తాగి వాహనాలు నడుపుతున్నారు. మద్యం మత్తులో యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఒక బస్సు డ్రైవర్ పీకలదాకా తాగి యాక్సిడెంట్ చేశాడు. బస్సులో 42 మంది ప్రయాణికులను ప్రమాదంలో పడేశాడు. అప్పుడొచ్చాడండి హీరో.
బస్సు, రైళ్లు, విమానాలు నడిపే వారు చాలా బాధ్యతగా ఉండాలి. మద్యం అస్సలు సేవించకూడదు. మద్యం సేవించి నడిపితే ఎంతోమంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. బస్సు డ్రైవర్ తప్పు చేయడం వల్ల బస్సులో ఉన్న 50, 60 మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అయితే ఇవేమీ పట్టని ఒక డ్రైవర్ మద్యం తాగడమే కాకుండా.. ఆ మత్తులో డివైడర్ ను గుద్దాడు. బస్సుని కంట్రోల్ చేయలేక బస్సుని రోడ్డుపై డ్యాన్స్ ఆడిస్తున్నాడు. ప్రయాణికులకు భయం వేసింది. మార్గం మధ్యలో డ్రైవర్ కి వాంతులు కూడా అయ్యాయి. డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో డివైడర్ ను గుద్దాడు. కాంట్రాక్ట్ బస్సు డ్రైవర్ ఆగ్రా నుంచి ఉత్తరప్రదేశ్ లోని మధురకు 42 మంది ప్రయాణికులను బస్సులో తీసుకెళ్తున్నాడు.
అయితే మద్యం సేవించి ఉండడం వల్ల వీరందినీ ప్రమాదంలో పడేశాడు. 15 కిలోమీటర్ల వరకూ ఆ తాగుబోతు డ్రైవర్ బస్సుని నడిపాడు. అయితే బస్సు పదేపదే కంట్రోల్ తప్పుతుండడంతో ప్రయాణికులు అడ్డుకున్నారు. దీంతో బస్సు డ్రైవర్ రుంకట సమీపంలో బస్సు దిగేసి పారిపోయాడు. అయితే ఆ సమయంలో ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన ప్రయాణికుడు బస్సు నడిపేందుకు ముందుకు వచ్చారు. ఆగ్రాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ మేనేజర్ గా పని చేస్తున్న సంకల్ప్ అనే ప్రయాణికుడు.. డ్రైవర్ గా మారి ప్రయాణికులను సురక్షితంగా మథుర బస్టాండ్ కి చేర్చారు. గురువారం రాత్రి కాంట్రాక్ట్ బస్సు ఆగ్రా నుంచి మథుర బయలుదేరింది. బస్ యజమాని సీతారాం. ఈ కాంట్రాక్ట్ బస్సుకి డ్రైవర్ గా కృష్ణగోపాల్ అనే వ్యక్తి ఉన్నాడు.
అనారోగ్యం కారణంగా మనీష్ సింగ్ అనే డ్రైవర్ ని పంపించాడు. బస్సు ఆపరేటర్ అంకిత్ శుక్ల. 42 ప్రయాణికులు బస్సులో ఉన్నారు. బస్సు డ్రైవర్ మనీష్ సింగ్ తాగి వచ్చాడని ప్రయాణికులు వెల్లడించారు. బస్సుని కంట్రోల్ చేయలేకపోతున్నాడని, డివైడర్ ను గుద్దాడని.. అయితే బస్సు డివైడర్ ను ఎక్కలేదని అన్నారు. డ్రైవర్ రుంకట గ్రామ సమీపంలో వాంతులు కూడా చేసుకున్నాడని.. బస్సు నడిపే స్థితిలో లేడని తెలిసి నిరసన తెలిపామని అన్నారు. దీంతో ఆ డ్రైవర్ బస్సు దిగేసి పారిపోయాడని ప్రయాణికులు వెల్లడించారు. ఆపరేటర్ అంకిత్ శుక్ల బస్సు డ్రైవర్ కోసం కాల్ చేయగా.. ఎవరూ స్పందించలేదు.
దీంతో బలదేవ్ పూరి మహోలి రోడ్, మథుర నివాసి, ఆగ్రాలో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న సంకల్ప్ అనే వ్యక్తి బస్సు స్టీరింగ్ పట్టుకున్నారు. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సు నడిపారు. రుంకట నుంచి మథుర వరకూ బస్సు నడిపి వారిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు. రాత్రి 9.30కి మథుర బస్టాండ్ కి బస్సు చేరుకున్న తర్వాత ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాను చాలా నెమ్మదిగా బస్సు నడిపానని.. 40 కిలోమీటర్ల దూరం వరకూ డ్రైవ్ చేశానని సంకల్ప్ వెల్లడించారు. ఇదిలా ఉంటే బస్ స్టేషన్ రోడ్ వేస్ సూపరింటెండెంట్ అధికారి బస్ డ్రైవర్లను ఇద్దరినీ తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మరి తాగి డ్యూటీ ఎక్కిన డ్రైవర్ పై, అలానే ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చిన సంకల్ప్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.