మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని పోలీసులు హెచ్చరిస్తున్నా గానీ కొంతమంది మాత్రం మాట వినడం లేదు. పీకలదాకా తాగి వాహనాలు నడుపుతున్నారు. మద్యం మత్తులో యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఒక బస్సు డ్రైవర్ పీకలదాకా తాగి యాక్సిడెంట్ చేశాడు. బస్సులో 42 మంది ప్రయాణికులను ప్రమాదంలో పడేశాడు. అప్పుడొచ్చాడండి హీరో.
సంక్రాంతి.. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ. ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్లి సెటిల్ అయిన వారంతా ఈ ఒక్క పండగ కి మాత్రం తమ సొంత ఊరికి చేరుకుంటూ ఉంటారు. చుట్టాలు, స్నేహితులు మధ్య పండగ మూడు రోజులు ఆనందంగా గడపాలని తపిస్తూ ఉంటారు. ఇందుకే ఎంత కష్టం అయినా.. సంక్రాంతికి అందరూ కచ్చితంగా ప్రయాణాలు పెట్టుకుంటారు. అయితే.. ఇదే అదునుగా భావించే ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఈ గ్యాప్ లో దందాకి తెర లేపుతుంటాయి. […]
పండగలు వస్తే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ వారు దోపిడీకి పాల్పడతారు. అప్పటి వరకూ లేని టికెట్ ధరలు ఆ పండగ సీజన్ లో చూస్తారు. రద్దీ కారణంగా.. బస్సులు దొరకవన్న భయంతో ఎంత ధర ఉన్నా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుని సొంత ఊర్లు వెళ్తారు. పండగలు వచ్చాయంటే ప్రైవేట్ ట్రావెల్స్ వారి దోపిడీ రాజ్యం ఏలుతుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే సామాన్యుల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ వారే బాగా పండగ చేసుకుంటారు. ఇన్నాళ్లూ అడ్డు చెప్పేవాళ్లు […]
హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే మలక్ పేట్ లోని ఓ హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించగా.. తాజాగా ఓ ట్రావెల్ బస్సు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. కూకట్ పల్లి జేఎన్టియూ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కావేరి ట్రావెల్స్ కి చెందిన బస్సులోంచి ఒక్కసారిగా బస్సులోంచి మంటలు చెలరేగాయి. మెట్రో స్టేషన్ కింద బస్సు తగలబడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ప్రైవేట్ బస్సు […]
Private Bus: ఈ మధ్య కాలంలో ప్రైవేట్ బస్సులు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ, 20 మంది దాకా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన జరిగి నెలకూడా గడవకముందే నెల్లూరు జిల్లాలో మరో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బళ్లారి నుంచి నెల్లూరు వస్తున్న ఓ ప్రైవేట్ […]