వర్క్ ఫ్రమ్ హోమ్.. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా రావడం వల్ల ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం దక్కింది. దాదాపు లాక్‌డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్‌నే కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి నగరాలు మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కేవలం మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి సాగింది. విదేశాల్లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కాదు.. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అంటూ అవకాశాన్ని కూడా కల్పించాయి. ఇప్పుడు ఇంకో కొత్త కల్చర్ వచ్చేసింది. అదేంటంటే వర్క్ ఫ్రమ్ పబ్. కొత్తగా ఉందా? అవును అసలు ఆ కల్చర్ ఏంటో చూద్దాం పదండి.
ఈ పబ్ ఫ్రమ్ కల్చర్ అనేది ప్రస్తుతానికి అయితే మన దగ్గరకు రాలేదులెండి. ఇప్పుడు యూకేలో ఈ కల్చర్ బాగా పాపులర్ అయ్యింది. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం యూకేలో పబ్‌ల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా తమ ఉద్యోగులకు ఎక్కువ సదుపాయాలు కల్పిస్తూ వర్క్ ఫ్రమ్ పబ్ కల్చర్‌ను కంపెనీలు సైతం ప్రోత్సహిస్తున్నాయంట. ఈ కల్చర్‌ని గమనించిన పబ్స్ సైతం అక్కడి నుంచి పనిచేసేందుకు వీలుగా పబ్ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అందుకోసం ఒక్కొక్క వ్యక్తికి 10 పౌండ్లు ఛార్జ్ చేస్తున్నాయంట. అంటే ఒక ఎంప్లాయ్‌కి రోజుకు రూ.900 అనమాట. ఆ 10 పౌండ్లలోనే ఆ వ్యక్తికి డ్రింక్స్, లంచ్ కూడా ఇస్తున్నాయి.
Many British pubs are now offering ‘work from pub’ (WFP) deals as a means of luring remote workers in.
READ MORE: https://t.co/idYtRuz6Sn#TheProjectTV pic.twitter.com/dBNGFLwhjT
— The Project (@theprojecttv) October 13, 2022
పుల్లర్స్ చైన్‌లోని 380 పబ్స్ ఇలా వర్క్ ఫ్రమ్ పబ్‌కు అనుగుణంగా ఇలాంటి ఏర్పాట్లు చేశాయి. తర్వాత బ్రూవెరీ యంగ్ కూడా ఇలాగే 185 పబ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. రోజులో 15 పౌండ్లు(రూ.1300) ఛార్జ్ చేస్తున్నాయి. వాటిలోనే అన్‌లిమిటెడ్ టీ, కాఫీ, సాండ్‌విచెస్‌ని కూడా అందిస్తున్నాయి. ఈ కల్చర్ వల్ల అటు పబ్స్ కి కూడా ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అలవాటు పడిన వారికి ఇది కొత్తగా ఉంటోంది. పైగా ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా పని మీద దృష్టి పెట్టవచ్చు. పైగా అన్‌లిమిటెడ్ టీ, కాఫీ, సాండ్‌విచెస్, కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, లంచ్ అన్నీ వస్తుండటంతో బాగా లైక్ చేస్తున్నారు. పబ్స్ కూడా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్, ల్యాప్‌టాప్‌తో వర్క్ చేసే వారిని టార్గెట్ చేస్తూ మంచి లాభాలను పొందుతున్నాయి.
Working from home driving you up the wall ? Sick of staring at the same 4 walls ? Come and work from the pub instead .. we’ve got a warm welcome, fabulous food, free Wi-Fi & Coffee ! pic.twitter.com/sAAZhAw9jK
— The Crown (@thecrownminch) October 7, 2022