మంచి సంస్థలో ఉద్యోగం చేయాలి, జీతం లక్షల్లో ఉండాలనేది కొన్ని లక్షల మంది కల. ఉద్యోగం వస్తే కళ్ళకి హత్తుకుని తీసుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లక్షల్లో జీతం అంటే లగ్జరీ లైఫ్, కావాల్సినవన్నీ కాళ్ళ దగ్గరకి వస్తాయి. సొంత ఇల్లు, సొంత కారు, లేని లోటు అంటూ ఏమీ ఉండదు. ఇంతకంటే ఒక ఉద్యోగికి ఇంకేం కావాలి. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇవేమీ వద్దని జాబ్ ని వదిలేసుకున్నాడు. జాబ్ సెక్యూరిటీ, బాస్ తో, క్లైంట్ తో మీటింగ్ లు, ప్రాజెక్ట్ వర్కులు, కరెక్ట్ గా నెలైతే అకౌంట్ లో పడే లక్షల జీతం, ఇంద్రభవనం లాంటి ఇల్లు, లగ్జరీ కారు, ఇంట్లో పనోళ్ళు, విలాసవంతమైన జీవితం.. ఇవేమీ సంతృప్తినివ్వని పేదవాడు అయ్యాడు ఆ వ్యక్తి. తన జీవితంలో అన్నీ ఉన్నా ఒక్కటి తగ్గింది పుష్ప అని తనను తాను క్వశ్చన్ చేసుకున్నాడు. నేను ఏంటి అని తనను తాను వెతుక్కున్నాడు.
Left a job of 82 lakhs, then became a sweeper, know why the person took such a stephttps://t.co/B5p4QmPFvk
— Hardin (@hardintessa143) October 13, 2022
ఆ తగ్గింది ఏంటి అని వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తి తగ్గిందంట. నేను ఏంటి అని వెతుక్కుంటే తన జీవితంలో కిక్ లేదంట. వింటుంటే కిక్ సినిమాలో రవితేజలా అనిపిస్తున్నాడు కదూ. ఇంతకే అతనెవరో కాదు ఆస్ట్రేలియాకి చెందిన పాల్. ఇప్పుడంటే సాఫ్ట్ వేర్ జాబ్ ని తృణప్రాయంగా వదులుకున్నాడు గానీ ఒకప్పుడు ఆ జాబ్ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో. చిన్నతనంలో పాల్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను చూశాడు. దొరికిన చిన్న పని చేస్తూ కుటుంబానికి అండగా నిలబడేవాడు. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తే తప్ప తన కుటుంబాన్ని బాగా చూసుకోలేనని నమ్మిన వ్యక్తి పాల్. అనుకున్నట్టుగానే ఒక పక్క పనులు చేస్తూ.. మరోపక్క కష్టపడి చదువుకుని ప్రయోజకుడు అయ్యాడు. ఒక ఫైనాన్స్ సెక్టార్ లోని బడా కంపెనీలో ఉద్యోగం పట్టాడు.
23 ఏళ్ల పాటు ఒకే కంపెనీలో ఉన్నాడు. జీతం రూ. 82 లక్షలకు చేరింది. అయితే అతనికి అసంతృప్తి ఉండిపోయింది. తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఉద్యోగం, ఉద్యోగానికి సంబంధించిన మీటింగులు తప్ప ఇంకేమీ కనబడలేదు. తన జీవితం తనకి కనబడలేదు. తన జీవితం మిస్ అయ్యాడనిపించింది. ఆ ఉద్యోగంలో, మీటింగుల్లో అతను కనిపించడంలేదని జాబ్ మానేశాడు. ఎప్పుడూ ఉరుకులు పరుగులు పెడుతూ జీవితాన్ని మధ్యలో ముగించేయడం అవసరమా అనుకున్నాడు. ప్రశాంతంగా ఒక చోట ఉండే ఉద్యోగం ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. అలా రకరకాల జాబులకు ట్రై చేశాడు. కానీ ఫైనాన్స్ రంగంలో చేసిన నీకు మా దాంట్లో జాబ్ ఎలా ఇస్తామని ఎవరూ అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో చిన్నతనంలో మెక్ డొనాల్డ్స్ లో చేసిన స్వీపర్ జాబ్ నే ఎంచుకున్నాడు.
చిన్నప్పుడు కుటుంబానికి అండగా ఉండేందుకు మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో స్వీపర్ జాబ్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు అదే జాబులో జాయినయ్యాడు. పాల్ అప్లై చేసిన 10 నిమిషాల్లో అతనికి స్వీపర్ గా ఉద్యోగం వచ్చింది. పాల్ సంతోషానికి అవధులు లేవు. దీంతో పాల్ చిన్నప్పుడు పని చేసిన మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ లో నైట్ షిఫ్ట్ జాయినయ్యాడు. ప్రస్తుతం స్వీపర్ గా తనకి ఈ జాబ్ సంతృప్తినిస్తుందని, తాను ఈ జాబ్ పట్ల 100 శాతం సంతోషంగా ఉన్నానని చెబుతున్నాడు. ప్రధానంగా ఇక్కడ మీటింగుల గోల లేదని అంటున్నాడు. అదన్నమాట విషయం.. లక్షల్లో జీతం వచ్చినా సంతృప్తి లేని ఎవరైనా పేదవాడితో సమానమే. ఇప్పుడు తనకు నచ్చిన పని చేస్తున్నాడు. ఇంతకంటే ధనవంతుడు ఇంకెవరుంటారు చెప్పండి.
రూ. 82లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదులుకొని.. మెక్‌డొనాల్డ్స్‌లో స్వీపర్‌గా చేరాడు.. కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు!https://t.co/0PPJCqaL95
— ABN Telugu (@abntelugutv) October 13, 2022