పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి చూడటానికి ఎంతో అందంగా, అమాయకంగా కనిపిస్తుంది కదా. ఇలా కనిస్తుందని మాత్రం అస్సలు జాలి, దయ అనేవి చూపించకండి. అవును మీరు విన్నది. ఈ అందాల రాక్షసి చేసిన ఘోరం వింటే నోరెళ్లబెట్టాల్సిందే. ఊహించని రీతిలో దారుణానికి పాల్పడి అమాయకపు చిన్నారుల ప్రాణాలను పొట్టన బెట్టుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. చూడటానికి ఇంత అమాయకంగా కనిపిస్తున్న ఈ యువతి చేసిన ఘోరం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ యువతి పేరు లూసీ లెట్బీ. యూకేలోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పటల్ లో నర్సుగా సేవలు అందిస్తుంది. అయితే ఈ నర్సు ఇటీవల ఆస్పత్రిలో జన్మించిన 5 రోజుల పసికుందుపై ఎవరూ ఊహించని దారుణానికి తెర లేపింది. ఆ చిన్నారి వద్ద ఎవరూ లేని సమయంలో ముక్కు ట్యూబ్ ద్వారా గాలి ఇంజెక్ట్ చేసింది. దీంతో ఈ పసి కందు ప్రాణాలు కోల్పోయింది. అయితే కూతురు మరణించడంతో ఆ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా ఈ చిన్నారి కుటుంబ సభ్యులకు ఎందుకో ఆ నర్సు మీద అనుమానం వచ్చింది. ఏం జరిగిందని గట్టిగా ప్రశ్నించగా.., ముక్కు ట్యూబ్ ద్వారా గాలిని ఇంజెక్ట్ చేసినట్లు తెలిసింది.
ఈ విషయం తెలుసుకున్న ఆ చిన్నారి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను విచారించారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2015 నుంచి 2016 ల మధ్య కాలంలో ఇలా ముక్కు ట్యూబ్ ద్వారా గాలి ఇంజక్ట్ చేసి ఇప్పటి వరకు ఏడుగురు శిశువులను హత్య చేసిందట. ఇక ఇదే కాకుండా మరో పది చిన్నారులను చంపేందుకు పథకం కూడా రచించినట్లుగా తెలుస్తోంది. యువతి చేసిన దారుణాలపై బాధిత కుటుంబ సభ్యులు స్పందించి ఆ యువతిని దారుణంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల వెలుగులకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.