భార్యా భర్తల మధ్య బంధం నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. భర్త ప్రతి విజయంలోనూ భార్య పాత్ర ఉంటుంది. అలాగే చిన్న చిరునవ్వుతో భర్త లాలనగా దగ్గరకు తీస్తే అన్ని బాధలు మర్చిపోతుంది భార్య. పొరపచ్ఛాలు లేకుండా దంపతులిద్దరూ కలిసుంటే
భార్యా భర్తల మధ్య బంధం నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. భర్త ప్రతి విజయంలోనూ భార్య పాత్ర ఉంటుంది. అలాగే చిన్న చిరునవ్వుతో భర్త లాలనగా దగ్గరకు తీస్తే అన్ని బాధలు మర్చిపోతుంది భార్య. పొరపచ్ఛాలు లేకుండా దంపతులిద్దరూ కలిసుంటే ఆర్థిక సంబంధాలు కూడా వీరి బంధాన్ని దెబ్బతీయలేవు. అర్థం చేసుకునే మనస్థత్వంతో సాగిపోతుంటే ఎంతంటి కష్టానైన్నా సునాయాసంగా దాటేయొచ్చు. కానీ నేటి బంధాలు బలహీన పడుతున్నాయి. భార్యను బయటకు పంపిస్తే.. తనను కాదని మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందన్న అనుమానంతో పాటు ఆమె ఎదుగుదల చూడని పురుషాధిక్య సమాజంలో బ్రతుకుతున్నాడు మగవాడు. అలాంటి పురుషుల్లో కూడా పుణ్య పురుషులున్నారని నిరూపిస్తున్నారు ఇటువంటి వారు.
భార్య అభ్యున్నతిని ఎలా అభినందించాలో తెలియక.. పెద్ద హంగామా సృష్టించి ఆమెపైన అపారమైన ప్రేమను కురిపించాడో భర్త. భర్త సర్ ప్రైజ్‌కు మంత్ర ముగ్దురాలు అయిపోయింది ఆ ఇల్లాలు. హైదరాబాద్‌కు చెందిన దీనా అనే మహిళ..పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఆమె ప్రతిభను గుర్తించిన డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ట్రైనింగ్‌కు వెళ్లింది మహిళ. 18 నెలల చిన్నారిని వదిలి, కుటుంబాన్ని విడిచిపెట్టి 45 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుంది. ట్రైనింగ్ పూర్తి కాగానే.. ఇంటికి చేరుకున్న మహిళకు ఇంజనీర్ అయిన భర్త రొనాల్ట్ బాసిల్ గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. చుట్టు పక్కల వారిని పిలిచి.. బ్యాండ్, బాణా సంచా ఏర్పాటు చేసి స్వాగతం పలికాడు.
శాలువా, పూలతో సత్కరించాడు. కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచాడు. ఈ ఏర్పాట్లను చూసి ఆనంద భాష్పాలు రాల్చింది దీనా. కాగా, ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇది చూసిన ప్రతి ఒక్కరు ఇటువంటి భర్త కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. గుడ్ హబ్బీ, ప్రతి ఆడదాని విజయం వెనుక ఓ అర్థం చేసుకునే భర్త ఉంటాడని నెటిజన్ కమెంట్ చేయగా.. అంత ప్రేమించి మన కోసం ఎఫోర్ట్ పెట్టే వాళ్లు దొరకాలంటే రాసి పెట్టి ఉండాలని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మీరు డబుల్ లక్కీం మేడం..ప్రేమించే భర్త దొరకడంతో పాటు.. తెలంగాణ ప్రజలకు సేవ చేసే పోలీస్ శాఖను ఎంచుకున్నారు అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. భార్యలు, భరత్‌లు ప్రశాంతంగా ఉండనిస్తే ఇలాంటివి ఎన్నైనా చేయోచ్చు అని మరో నెటిజన్ భిన్నంగా స్పందించారు.
#Hyderabad– Husband welcomes wife’s promotion as head constable with teen maar, heartwarming video goes viral. pic.twitter.com/VvqdOUtz4i
— @Coreena Enet Suares (@CoreenaSuares2) July 21, 2023