ఓ అమ్మాయి తన మాజీ లవర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ యువతి తన మాజీ ప్రియుడితో భారీగా జరిమానా కట్టేలా ప్లాన్ చేసినా, ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో షాక్సింగ్ లో జరిగింది. తనను కాదని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనే కోపంతో మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసిందా యువతి. అతని కారును అద్దెకు తీసుకుని స్నేహితురాలి సాయంతో రెండు రోజుల్లోనే ట్రాఫిక్ సిగ్నల్స్ ను 49సార్లు క్రాస్ చేసి అతనికి భారీగా ఫైన్ పడేలా చేసింది. ట్రాఫిక్ రూల్స్ 2 రోజుల్లోనే 50సార్లు బ్రేక్ చేయడంతో లోకల్ పోలీసులు కారును గుర్తించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. చెన్ కియాన్ అనే పేరున్న వ్యక్తిని దాని ఓనర్ గా గుర్తించారు. ఝూ అనే మహిళకు కారు అద్దెకు ఇచ్చానని ఆ ఓవర్ స్పీడ్ కు, సిగ్నల్ క్రాస్ చేసిన దానికి తనకు సంబంధం లేదంటూ వాపోయాడు.
‘ఝూ’ను పిలిపించి విచారణ మొదలుపెట్టిన పోలీసులు కారణం విని షాక్ అయ్యారు. తనతో పాటే చాలా కాలంగా చదువుకుంటున్న లౌ అనే అమ్మాయితో కలిసి ఇలా చేశానని చెప్పింది. ఇదంతా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనే చేశానని, వేరే మహిళతో తిరగడం మొదలుపెట్టాడనని అందుకే స్నేహితురాలి పేరుతో కార్ అద్దెకు తీసుకున్నానని చెప్పిందామె. పాపం ఆ యువతి ప్లాన్ అయితే వేసింది గానీ చివర్లో అది ఫైయిల్ కావడమే గాకా కటకటాలపాలైంది.
రీసెంట్ గా ఓ అమ్మాయి ప్రియుడితో విడిపోయిన తర్వాత, అతనికి గిఫ్ట్‌గా ఇచ్చిన ఖరీదైన బైక్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టిన సంగతి తెలిసిందే.