ఈ మద్య కొంతమంది అత్యుత్సాహంతో డ్రైవింగ్ గురించి పూర్తిగా అవగాహన లేకున్నా రోడ్లపై బైక్స్, కార్లు నడుపుతున్నారు. ఆ సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి.
అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా అనేక నిర్ణయం తీసుకుంటున్నా.. ట్రాఫిక్ సమస్యతో వాహనదారులకు ఇబ్బందులతో పాటు వాయి కాలుష్యం కూడా అధికమవుతోంది. అయితే టర్కీ నగరం ఇస్తాంబుల్ ఓ టెక్నికల్ యూనివర్సిటీతో కలిసి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే వీళ్లు మాత్రం ఏకంగా మంచి ఐడియాకు పదునుపెట్టారు. అదేంటంటే? ట్రాఫిక్ తో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది కూడా చదవండి: […]
ప్రధాని మోదీకి రైతుల నిరసన సెగ తగిలింది. పంజాబ్ లో రైతులు రోడ్డును నిర్బంధించడంతో దేశ ప్రధాని సాధారణ పౌరుడిలా 20 నిమిషాలు ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సి వచ్చింది. దీనికి పంజాబ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే అంటూ సరైన వివరణ ఇవ్వాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది. Security breach in PM Narendra Modi’s convoy near Punjab’s Hussainiwala in […]
హైదరాబాద్- సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ లోని హైటెక్స్‌లో జరుగనున్నాయి. ఈ క్రమంలో వాహనాదారులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రీనరీ నేపధ్యంలో సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ను పలు మార్గాల్లో దారి మళ్లిస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్ కు సైబర్ టవర్స్ […]
రష్యాలోని దక్షిణ స్టావ్‌రోపోల్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసు అధికారి కల్ అలెక్సీ సఫోనోవ్ పై నమోదైన అవినీతి ఆరోపణలపై రష్యా అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు ట్రాఫిక్ పోలీస్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడి సౌకర్యాలను చూసిన అధికారులు విస్తుపోయారు. వాటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఇంటిని చూస్తే ఎవరూ పోలీస్ అధికారి ఇల్లు అనుకోరు. తప్పకుండా అది రాజభవనం కావచ్చని భావిస్తారు. బెడ్ రూమ్ నుంచి టాయిలెట్ల […]
ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అలకాపురి సిగ్నల్ వద్ద టాటా మోటార్స్ షోరూంలో ప్రమాదం చోటు చేసుకుంది. కస్టమర్ కారు ట్రయల్ చేస్తుండగా అది ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. షోరూం యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కారును స్టార్ట్ చేయడం తో హఠాత్తుగా మొదటి అంతస్తు నుండి హైడ్రాలిక్ సిస్టం పై దూసుకు వచ్చిన కారు పార్కింగ్ లో ఉన్న కారుతో పాటు బైకుపై […]
వాహనాలు, రోడ్లు, ఇతరత్రా కారణాల వల్ల నిత్యం గాల్లోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పీఎం 10, పీఎం 2.5 అత్యంత ప్రమాదకరమైనవి. పీఎం 2.5 కంటికి కనిపించదు. తల వెంట్రుక మందం(50 మైక్రోగ్రాములు)లో 20వ వంతు ఉంటుంది. గాలి పీల్చగానే నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడే స్థిరపడి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ నేపధ్యంలో వాహన కాలుష్యం పరిమితిలోనే ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం (పీయూసీ) వాహనాలకి ఉండాలనే సంగతి తెలిసిందే. కాలుష్య పరీక్ష జాప్యం […]
ఓ అమ్మాయి తన మాజీ లవర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ యువతి తన మాజీ ప్రియుడితో భారీగా జరిమానా కట్టేలా ప్లాన్ చేసినా, ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో షాక్సింగ్ లో జరిగింది. తనను కాదని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనే కోపంతో మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసిందా యువతి. అతని కారును అద్దెకు తీసుకుని స్నేహితురాలి సాయంతో రెండు […]
భాగ్యనగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కాయి. గతేడాది మార్చి 22 నుంచి ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు నిలిచిపోయాయి. 15 నెలల సుదీర్ఘ విరామం తరువాత రైళ్లు పరుగులు తీస్తున్నాయి. గతేడాది కరోనాతో నిలిచిపోయిన రైళ్ల సేవలు తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభించారు. గతంలో 121 సర్వీసులు తిరిగేవి. అయితే ఈరోజు నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య ఇరువైపులా మూడు చొప్పున మొత్తం 6, హైదరాబాద్- లింగంపల్లి మధ్య కూడా ఇరువైపులా […]
హైదారాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవ్వరైనా కానీ చలాన్ విధిస్తున్నారు. అయినా కానీ కొంతమంది పోకిరీలు యధేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలను బేకాతరు చేస్తున్నారు. ఇష్టమొచ్చిన తీరుగా వ్యవహరిస్తున్నారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ఇలాంటి కేసే ఒకటి పోలీసులకు చిక్కింది. ఓ అమ్మాయికి వచ్చిన చలాన్లు తాజాగా ఓ ట్రాఫిక్ పోలీసులు సైతం షాక్ అయ్యారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో అమ్మాయి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు సైతం నివ్వెరపోయారు. […]