ప్రధాని మోదీకి రైతుల నిరసన సెగ తగిలింది. పంజాబ్ లో రైతులు రోడ్డును నిర్బంధించడంతో దేశ ప్రధాని సాధారణ పౌరుడిలా 20 నిమిషాలు ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ లో ఇరుక్కోవాల్సి వచ్చింది. దీనికి పంజాబ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమే అంటూ సరైన వివరణ ఇవ్వాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వాన్ని కోరింది.
Security breach in PM Narendra Modi’s convoy near Punjab’s Hussainiwala in Ferozepur district. The PM’s convoy was stuck on a flyover for 15-20 minutes. pic.twitter.com/xU8Jx3h26n
— ANI (@ANI) January 5, 2022
అసలు ఏం జరిగిందంటే.. ప్రధాని మోదీ హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మరకాన్ని సందర్శించేందుకు భఠిండా చేరుకున్నారు. అక్కడి నుంచి హుస్సేనీవాలాలోని స్మారకం వద్దకు హెలికాప్టర్ వెళ్లాలి. కానీ, అక్కడ వాతావరణం అనుకూలించలేదు. కాసేపు భఠిండాలోనే వేచి ఉన్నారు. అప్పటికీ వాతావరణంలో మార్పు లేకపోవండతో రోడ్డు మార్గాన వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రోడ్డు మార్గంలో భఠిండా నుంచి హుస్సేనీవాలాకు వెళ్లేందుకు దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఆ విషయాన్ని పంజాబ్ డీజీపీకి ముందుగానే సమాచారమిచ్చారు. రోడ్డు మార్గంలో భద్రతా ఏర్పాట్ల ధ్రువీకరణ తర్వాత మోదీ బయల్దేరారు.
It’s a matter of shame that PM Modi’s cavalcade was stopped by protesters on his way to launch development schemes for welfare of Punjab. This is a serious security lapse & the fact that the Punjab CM didn’t address the issue makes matters even worse: Assam CM Himanta Biswa Sarma pic.twitter.com/LONRveQUOx
— ANI (@ANI) January 5, 2022
మోదీ ఓ ఫ్లైఓవర్ వద్దకు చేరుకునే సరికి కొందరు ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేశారు. పైవంతెనపై ప్రధాని మోదీ దాదాపు 20 నిమిషాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. చేసేది లేక మోదీ జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించుకోవాల్సిన పర్యటనను రద్దు చేసుకుని భఠిండా విమానాశ్రయానికి తిరిగి వెళ్లిపోయారు. ప్రధాని పర్యటించే రోడ్డు మార్గంలో ట్రాఫిక్ నే అనుమతించరు.. అలాంటిది మోదీనే ట్రాఫిక్ లో చిక్కుకోవడం జాతీయస్థాయిలో పెద్ద చర్చకు దారి తీసింది. అంతేకాకుండా ఫిరోజ్ పూర్ పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు.
Officials at Bhatinda Airport tell ANI that PM Modi on his return to Bhatinda airport told officials there,“Apne CM ko thanks kehna, ki mein Bhatinda airport tak zinda laut paaya.” pic.twitter.com/GLBAhBhgL6
— ANI (@ANI) January 5, 2022
బుధవారం ఫిరోజ్ పూర్ లో రూ.42,750 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమాలను రద్దు చేయకుండా వాయిదా వేయాల్సిందిగా మోదీ కోరినట్లు అధికారులు వెల్లడించారు. మరోరోజు ఆ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తామంటూ తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది భద్రతా వైఫల్యమే అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై పూర్తి వివరణ, నివేదిక ఇవ్వాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశిచింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.