అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా అనేక నిర్ణయం తీసుకుంటున్నా.. ట్రాఫిక్ సమస్యతో వాహనదారులకు ఇబ్బందులతో పాటు వాయి కాలుష్యం కూడా అధికమవుతోంది. అయితే టర్కీ నగరం ఇస్తాంబుల్ ఓ టెక్నికల్ యూనివర్సిటీతో కలిసి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే వీళ్లు మాత్రం ఏకంగా మంచి ఐడియాకు పదునుపెట్టారు. అదేంటంటే? ట్రాఫిక్ తో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ఇది కూడా చదవండి: నడక పోటీలో విజేత..99 ఏళ్ల తాత!
రోడ్ల మధ్యలోని డివైడర్ దగ్గర నిట్టనిలువు టర్బైన్ ENLIL అనే పరికరాన్ని ఉంచుతారు. ఆ పరికరం పైన సోలార్ పవర్ ప్లేట్ ఉంటుంది. అది సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తోంది. ఇక పరికరానికి విండ్ టర్బైన్స్ అనే మూడు రెక్కలుంటున్నాయి. అవి వంపు తిరిగినప్పుడు ఏదైనా వాహనం రోడ్డుపై వేగంగా వెళ్లినప్పుడు గాలి ఎక్కువగా వస్తుంది. ఆ గాలి… పరికరానికి ఉన్న రెక్కలకు తగలగానే ఆ రెక్కలు గుండ్రంగా తిరుగుతాయి. వాటికి సెట్ చేసిన టర్బైన్ కూడా తిరుగుతుంది.
దాంతో కరెంట్ ఉత్పత్తి అవుతుందని టెక్నికల్ యూనివర్సిటీ అధికారులు తెలియజేస్తున్నారు. రోడ్డుకు నిట్టనిలువుగా ఉంచిన ఈ టర్బైన్ ENLILలు సంభవించబోయే భూకంపాల్ని కూడా గుర్తిస్తాయట. అయితే ఇలా ఉత్పత్తి చేసిన కరెంట్ ని వీది దీపాలకు ఉపయోగిస్తున్నారట అక్కడి మున్పిపల్ అధికారులు. ట్రాఫిక్ తో కరెంట్ తయారు చేద్దామని వచ్చిన ఐడియాకు నెటిజన్స్ హ్యాట్సాప్ చెబుతున్నారు. ఇలా ట్రాఫిక్ తో కరెంట్ ఉత్పత్తి చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.