ఈ మద్య కొంతమంది అత్యుత్సాహంతో డ్రైవింగ్ గురించి పూర్తిగా అవగాహన లేకున్నా రోడ్లపై బైక్స్, కార్లు నడుపుతున్నారు. ఆ సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి.
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. కొంతమంది డ్రైవింగ్ లో పూర్తిగా శిక్షణ తీసుకోకముందే అత్యుత్సాహంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణాలు అవుతున్నారు.. మరికొన్నిసార్లు మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా ఓ యువతి చేసిన డ్రైవింగ్ తో ఎన్నో వాహనాలు తుక్కు తుక్కు అయ్యాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళిత..
ఈ మద్య కొంతమంది డ్రైవింగ్ లో పూర్తిస్థాయిలో శిక్షణ పొందకముందే.. వాహనాలు రోడ్డుపై నడుపుతున్నారు. అలా చేయడం వల్ల వారికే కాదు.. రోడ్డుపై వెళ్తున్న ఎంతో మంది అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచిఉంటుంది. ఓ మహిళకు పూర్తిగా డ్రైవింగ్ పై పట్టు లేకున్నా కారు డ్రైవ్ చేస్తూ వచ్చింది. పార్కింగ్ వద్ద కారు ఆపాల్సి ఉండగా.. రివర్స్ గేరులో బ్రేక్, ఎక్స్ లేటర్ ని కంట్రోల్ చేయలేక వెనుక పార్క్ చేసిన బైక్స్ పైకి దూసుకు వెళ్లింది. దాంతో అక్కడ పార్క్ చేసి ఉన్న బైకులన్నీ ఒకదానిపై ఒకటి పడి తుక్కుకింద మారాయి. ఇంతబీభత్సం జరిగినా ఆ మహిళ కొద్దిసేపు కారును ని అలాగే పోనిచ్చింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ సంఘటన జరిగింది. తమ బైకులు ధ్వంసం కావడంతో బాధితులు లబో దిబో అన్నారు. డ్రైవింగ్ పూర్తిగా రాకుండా కారు ఎలా నడుపుతారు అంటూ ఆ మహిళపై విరుచుకుపడ్డారు. దీంతో ఆ మహిళ టెన్షన్ కి గురైంది.. కొంతమంది ఆమె బాధను అర్థం చేసుకొని శాంతింపజేశారు. ఆమె అలా కావాలని ఎందుకు చేసి ఉంటుంది.. పట్టు తప్పడం వల్ల పొరపాటు జరిగి ఉండవొచ్చు అంటూ మహిళకు సపోర్ట్ చేశారు. ఎవరైనా ఆ కారును కంట్రోల్ లోకి తీసుకొని ముందుగా బైక్స్ పై నుంచి జరపాలని సూచించారు. ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.