మీరు ఇంత వరకు మనుషులు కుక్కల్ని కాల్చి చంపిన ఘటనల గురించి విని ఉంటారు.. వార్తల్లో చదివి ఉంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ఇందుకు చాలా భిన్నమైనది. ఈ స్టోరీలో ఓ కుక్క తన యజమానిని తుపాకితో కాల్చి చంపింది. అయితే, ఆ కుక్క కావాలని తన యజమానిని కాల్చి చంపలేదు. పొరపాటున అలా జరిగిపోయింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాన్సాస్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి […]
ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అలకాపురి సిగ్నల్ వద్ద టాటా మోటార్స్ షోరూంలో ప్రమాదం చోటు చేసుకుంది. కస్టమర్ కారు ట్రయల్ చేస్తుండగా అది ఒక్కసారిగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. షోరూం యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కారును స్టార్ట్ చేయడం తో హఠాత్తుగా మొదటి అంతస్తు నుండి హైడ్రాలిక్ సిస్టం పై దూసుకు వచ్చిన కారు పార్కింగ్ లో ఉన్న కారుతో పాటు బైకుపై […]
50 రకాల స్వీట్లు, 250 కిలోల కిరాణా, 200 ఆవకాయ జాడీలు, 10 మేకపోతులు, 50 కోళ్లు, టన్ను చొప్పున కొర్రమేను, పండుగప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు, 250కిలోల బొమ్మిడాయిలు … హోటల్ మెనూ కాదు! అమ్మాయి తండ్రి వియ్యంకుడికి పంపిన ‘సారె’ ఇది. గోదావరి నది మహారాష్ట్రలో పుడితే మర్యాదలు గోదావరి జిల్లాల్లో పుట్టాయన్న సామెత . […]
మనం మనుషులమా జంతువులమా కొన్ని సంఘటనలవల్ల ఈ సందేహం వస్తుంటుంది. మనిషీ – జంతువూ రెండూ ఓ చిన్నారి ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంటే ఇక చెప్పేదేముంది. అంతకన్నా నేరమూ ఘోరమూ మరొకటి ఉండదు. దొంగ అనుకుని 16 ఏళ్ల బాలుడిని ఓ ఫామ్‌హౌస్ యజమాని కర్రతో చితకబాదాడు. అనంతరం ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఓ డ్రైవర్ కుమారుడైన సందీప్ మహతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి దేశ రాజధాని శివారు ప్రాంతం కపాషెరా […]
ఓ అమ్మాయి తన మాజీ లవర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ యువతి తన మాజీ ప్రియుడితో భారీగా జరిమానా కట్టేలా ప్లాన్ చేసినా, ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో షాక్సింగ్ లో జరిగింది. తనను కాదని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడనే కోపంతో మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసిందా యువతి. అతని కారును అద్దెకు తీసుకుని స్నేహితురాలి సాయంతో రెండు […]
బిచ్చగాళ్ళ స్థలాన్ని ఖాళీచేస్తుంటే లక్షలు కనబడ్డాయి. 65 ఏళ్ల యాచకురాలిని పునరావాస కేంద్రానికి తరలించిన తర్వాత ఆమె నివసించిన స్థలంలో ఏకంగా రూ. 2.58 లక్షల నగదు లభించిన ఘటన జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో చోటు చేసుకుంది. నగరంలోని వెటర్నరీ ఆస్పత్రి వద్ద తాత్కాలిక షెల్టర్ వద్ద ఓ వృద్ధురాలు గత 30 ఏళ్లుగా జీవిస్తోంది. ఆమెను మెరుగైన పునరావాస కేంద్రానికి తరలించాక ఆ షెల్టర్‌ను శుభ్రం చేస్తుండగా డబ్బు దొరికిందని అదనపు డిప్యూటీ కమిషనర్ సుఖ్‌దేశ్ సింగ్ […]