భూకంపం.. ఈ పేరు వింటే ప్రజలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ప్రభావం ఇప్పటికీ మర్చిపోలేని స్థితిలో ఉన్నారు.
ఇటీవల ప్రపంచ దేశాలను భూకంపాలు గజ గజ వణికిస్తున్నాయి. భూకంప ధాటికి బారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సిరియా, టర్కీ లో సంభవించిన భూకంపం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఈ భూకంప ధాటికి 50 వేలపైగా ప్రాణ నష్టం జరగగా.. కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఒకదశలో భూకంపం పేరు చెబితేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది. భారత్, నేపాల్, ఆఫ్ఘానిస్థాన్ తదితర దేశాల్లో తరుచూ భూకంపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం ఉదయం బీజీంక్ కి సమీపంలో భూకంపం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
చైనాలో భారీ భూకంపం సంభవించింది.. దీంతో ప్రజలు ఇళ్లు వదిలి పారిపోయారు. ఆదివారం ఉదయం బీజింగ్ కి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో డెజౌ నగరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.5 గా నమోదు అయినట్లు చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్స్ సెంటర్ తెలిపింది.ఈ భూకంప ప్రభావంతో నగరంలో దాదాపు 80 ఇళ్ల వరకు పూర్తిగా నేలమట్టం అధికారికంగా తెలిపారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. కాకపోతే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు చైనా ఎర్త్ క్వేక్ నెట్ వర్క్స్ సెంటర్ వెల్లడించింది.
ఇదిలా ఉంటే శనివారం అర్థరాత్రి దేశ రాజధాని ఢిల్లీ ఎన్ సీఆర్ సమీప ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చాలా మంది ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అని తీవ్ర ఆందోళన చెందారు. శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆఫ్ఘానిస్థాన్ హిందూకుష్ పర్వత శ్రేణుల్లో భూమి కంపించింది.. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.8 గా నమోదు అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. భూమికి దాదాపు 181 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆఫ్ఘానిస్థాన్ తో పాటు పాకిస్థాన్, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతంలో కూడా భూమి కంపించింది.
Earthquake of Magnitude:5.8, Occurred on 05-08-2023, 21:31:48 IST, Lat: 36.38 & Long: 70.77, Depth: 181 Km ,Location: Hindu Kush Region,Afghanistan for more information Download the BhooKamp App https://t.co/RXbLMDY0eW @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 pic.twitter.com/1Tu1TBDqCO
— National Center for Seismology (@NCS_Earthquake) August 5, 2023