బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన ప్రభుత్వం. దీనిపై కలగజేసుకున్న సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ తేదీలోపు కొత్త విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.
రవాణా రంగంలో అడుగుపెట్టిన ర్యాపిడో, ఓలా, ఉబర్ సంస్థలు వేలసంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా ఎంతో మంది బైక్ రైడర్స్ ఉపాధి పొందుతున్నారు. బైక్ ట్యాక్సీలను సులువుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవడం, అది ప్రయాణికుడు ఉన్నచోటుకే రావడం, సమయం ఆదా అవడం వంటి కారణాలతో ఎక్కువ మంది బైక్ ట్యాక్సీల వైపు మొగ్గు చూపుతున్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ బైక్ ట్యాక్సీ అందుబాటులో ఉంది. కాగా ఇప్పుడు ఈ బైక్ ట్యాక్సీ సర్వీసులపై నిషేధం విధించారు. ఇక ఈ నిషేధంపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని నెలల క్రితం ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో బైక్ టాక్సీ సర్వీసులపై నిషేధం విధించింది. దీంతో ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీల ప్రతినిధులు కోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేస్తూనే, బైక్ సేవలను అందించడానికి క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే ఢిల్లీలో బైక్ ట్యాక్సీల కోసం కొత్త విధానాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేసిన సుప్రీం కోర్టు బైక్ ట్యాక్సీల నిషేధంపై కొత్త విధానాన్ని రూపొందించేందుకు సెప్టెంబర్ 30 వరకు ఢిల్లీ ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. దీంతో ఢిల్లీ గవర్నమెంట్ సెప్టెంబర్ 30 లోపు నూతన పాలసీని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఢిల్లీలో ఓలా, ఉబర్, రాపిడో బైక్ ట్యాక్సీలు నడపాలా, వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నది. ఇదిలా ఉంటే బైక్ ట్యాక్సీల ద్వారా ఉపాధి పొందుతున్నవారు ప్రభుత్వ నిర్ణయంతో నిరాశ చెందుతున్నారు.