కొంతమంది దుండగులు బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో, కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబులు పెట్టామని పోలీసులకు బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో పోలీసులు పలానా ఏరియాలో డాగ్ స్క్వాడ్స్ తో బాంబ్ కోసం వెతుకుతారు. అయితే ఎంత వెతికినా దొరక్కపోవడంతో నకిలీ ఫోన్ కాల్ అని వెనుతిరుగుతారు. గతంలో ఇలానే ఓ చార్మినార్ దగ్గర బాంబు పెట్టామని పోలీసులకు కాల్ చేసి బెదిరించారు. ఓ విమానంలో కూడా బాంబు కలకలం సృష్టించింది. అధికారులు తనిఖీలు చేసి బాంబు లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరో విమానంలో బాంబు ఉందంటూ కొందరు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది. జెట్ స్టార్ అనే డొమెస్టిక్ విమానం 136 ప్రయాణికులు, 6గురు సిబ్బందితో జపాన్ లోని టోక్యోలో నారిట విమానాశ్రయం నుంచి సౌత్ వెస్ట్రన్ సిటీకి వెళ్ళాల్సి వెళ్తోంది. విమానం ప్రయాణంలో ఉండగా.. ఉదయం 6.20 నిమిషాలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. జపాన్ కి చెందిన వ్యక్తి ఫోన్ చేసి.. జెట్ స్టార్ విమానంలో బాంబు పెట్టామని చెప్పాడట. 100 కిలోల ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు విమానం యొక్క కార్గోలో పెట్టామని.. మేనేజర్ తో మాట్లాడించమని డిమాండ్ చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. దీంతో నారిట నుంచి సౌత్ వెస్టర్న్ సిటీ వైపు వెళ్తున్న విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో చుబు విమానాశ్రయం వైపు మరలించి.. ల్యాండ్ చేయించారు.
విమానంలో ఉన్న 142 మందిని విమానం లోంచి బయటకు పంపించారు. అనంతరం పోలీసులు, బాంబు స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి బాంబులు లేవని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో విమాన సేవలను 4 గంటల సేపు నిలిపివేశారు. పేలుడు పదార్థాలు లేవని తెలియడంతో విమాన సేవలను యధావిధిగా కొనసాగించారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు బాంబు బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తున్నాయి? పెట్టకపోయినా పెట్టామని ఎందుకు అంటున్నారు? పోలీసుల దృష్టి మరల్చి వేరే ఇతర చెడు కార్యకలాపాలకు పాల్పడడానికా? లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Passengers on a @JetstarAirways flight in Japan have had a mid-air scare after a bomb threat forced the plane to make an emergency landing. Tokyo’s Narita International Airport received a call from a man in Germany claiming to have put plastic explosives on the aircraft. #7NEWS pic.twitter.com/ctPAEIYb0U
— 7NEWS Australia (@7NewsAustralia) January 7, 2023