ఒడిశాలోని బాలాసోర్‌కు సమీపంలో జరిగిన పెను విషాదం నుంచి దేశ ప్రజలు ఇంకా బయటపడలేదు. అలాంటిది ఒక చోట రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
కొంతమంది దుండగులు బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో, కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబులు పెట్టామని పోలీసులకు బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో పోలీసులు పలానా ఏరియాలో డాగ్ స్క్వాడ్స్ తో బాంబ్ కోసం వెతుకుతారు. అయితే ఎంత వెతికినా దొరక్కపోవడంతో నకిలీ ఫోన్ కాల్ అని వెనుతిరుగుతారు. గతంలో ఇలానే ఓ చార్మినార్ దగ్గర బాంబు పెట్టామని పోలీసులకు కాల్ చేసి బెదిరించారు. ఓ విమానంలో కూడా బాంబు కలకలం సృష్టించింది. అధికారులు తనిఖీలు చేసి బాంబు […]
ఎవరికైనా తమ పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. తమ పేరు ఉన్న వ్యక్తులు ఎదురైతే లోపల ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది. బ్రో నీది, నాది ఒకే పేరు అని చెప్పుకుని సంబరపడిపోతుంటారు. అయితే జీవితంలో ఒకే పేరు గల వ్యక్తులు ఒకరిద్దరు ఎదురవుతుంటారు. కానీ వంద మందికి పైగా ఒకే పేరున్న వ్యక్తులు ఎక్కడైనా కలవడం చూశారా? మన పేరు కలిగిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ అందరూ కలవడం అనేది అసాధ్యం. […]
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. మహిళల టేబుల్ టెన్నిస్ ఫైనల్లో భవీనాబెన్ పటేల్ రజతం సాధించింది. పారాలింపిక్స్ చరిత్రలో టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. ప్రపంచ టీటీ నంబర్ 2, నంబర్ 3 పెడ్లర్‌లను ఓడించి ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓటమి పాలైంది. పారాలింపిక్స్‌లో దేశానికి రజతం అందించిన భవీనాబెన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ […]
టోక్యో ఒలంపిక్స్ లో పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు కాంస్యం గెలవడంలో గోల్ కీపర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. ఆయనపై ప్రశసంల జల్లు కురుస్తోంది. ఈ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు విజయాల్లో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ పాత్ర మర్చిపోలేనిది. గోల్ పోస్టు వద్ద ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలిచి భారత్ విజయాల్లో కీలక భూమిక పోషించాడు. చారిత్రక విజయం సాధించి భారత్ చేరుకున్న శ్రీజేష్ […]
టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. మన అథ్లెట్స్ సరికొత్త రికార్డులు. ఎక్కువ మెడల్స్ అమెరికావే! ఈసారి ఇండియా రికార్డ్… మెడల్ టేబుల్‌లో మన ప్లేస్ డబుల్ డిజిట్‌లోనే… ఆగస్టు 8 వరకు 17 రోజుల పాటు జరిగి విశ్వ క్రీడల సంగ్రామంలో ఎన్నో కొత్త మెరుపులు, రికార్డుల జపాన్ రాజధాని టోక్యో. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత్ టీమ్ ముందుండి మన జాతీయ జెండా పట్టుకుని నడిచే అదృష్టం రెజ్లర్ బజ్‌రంగ్ పునియాకు దక్కింది. ఈ సారి మన […]
జపాన్ రాజధాని టోక్యోలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఓవైపు ఒలింపిక్స్ జోరుగా సాగుతుండగా, కరోనా చాపకింద నీరులా చుట్టుముడుతోంది. నిన్న ఒక్క రోజులోనే ఏకంగా 4,058 కేసులు వెలుగు చూశాయని టోక్యో మెట్రో పాలిటన్ గవర్నమెంట్ తెలిపింది. ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్ లో ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే ఒలింపిక్ విలేజ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 193కి చేరగా, వైరస్ బారిన పడిన అథ్లెట్ల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. […]
ఎమ్మా మెక్‌కియాన్!.. టోక్యో ఒలింపిక్స్ 2020లో ఇప్పుడు ఈ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన మహిళా స్విమ్మర్ ఎమ్మా ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. దీంతో స్విమ్మింగ్ విభాగంలో తనకు ఎదురులేదని ఎమ్మా నిరూపించింది. ఆదివారం జరిగిన మహిళల 4×100 మీటర్ల రిలే ఈవెంట్‌లో ఆస్ట్రేలియా తరఫున గోల్డ్ మెడల్ గెలవడం ద్వారా ఎమ్మా ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఎమ్మా మొత్తం ఏడు విభాగాల్లో ఏడు పతకాలు సాధించింది. […]
లెజెండ్ బాక్సర్ కు నిరాశ తప్పలేదు. టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు విజయాల పరంపరను కొనసాగించారు. పతకాల వేటలో వడివడిగా దూసుకొని పోతున్నారు. గత కొన్ని రోజులుగా నిరాశపరుస్తున్న అథ్లెట్లు ఈ రోజు విజయాలతో అభిమానులను అలరించారు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలారు. అయితే మేరి కోమ్ ఓటమితో ఫ్యాన్స్ ఆశలు ఆడియాసలు అయ్యాయి. ఇండియన్ స్టార్ బాక్సర్ ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్ గోల్డ్ కల చేజారడంతో ఆమె ఫ్యాన్స్ […]
ప్రస్తుత ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒలింపిక్స్‌లో సంచలనం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో చాను సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో చైనా వెయిట్‌లిఫ్టర్ హు జిహుయి బంగారు పతకం గెలిచింది. అయితే, కొన్ని కారణాల వల్ల జిహుయిని ఒలింపిక్ గ్రామంలోనే ఉండాల్సిందిగా నిర్వహకులు ఆదేశించారు. ఆమెకు డోపింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు యాంటీ డోపింగ్ అధికారులు […]