రష్యాకి చెందిన మాస్కో విమానంలో బాంబు కలకలం సృష్టించింది. మాస్కో నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానంలో బాంబు ఉందంటూ సమాచారం వచ్చింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కంట్రోల్ రూమ్ కి గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక హెచ్చరిక మెయిల్ వచ్చింది. మాస్కో విమానంలో బాంబు ఉందనేది ఆ ఈమెయిల్ సారాంశం. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కంట్రోల్ రూమ్ వద్ద రష్యాకి చెందిన ఎస్ యు-272 విమానంలో బాంబులు పెట్టినట్లు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే భద్రతా ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. విమానాశ్రయంలో భారీ భద్రతను కూడా ఏర్పాటుచేశారు. శుక్రవారం తెల్లవారు జామున 2.48 నిమిషాలకు ఎస్ యు-272 విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.
Bomb Threat On Moscow Flight To Delhi With 400 On Board, Airport On Alert#AIRPORTALERT #BOMBTHREAT #DELHI #MOSCOWFLIGHT #THEWORLDSTIMES https://t.co/ySMGreB7Oa
— The Worlds Time (@theworldstimes) October 14, 2022
విమానం ల్యాండ్ అవ్వగానే.. అధికారులు అప్రమత్తమయ్యారు. విమానంలో ఉన్న అందరినీ వెంటనే దించేశారు. విమానం మొత్తం తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి బాంబులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ఉన్న 400 మంది ఉన్నారని, వారిలో 386 మంది ప్రయాణికులు కాగా 14 మంది సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇలానే బాంబు ఉందంటూ హెచ్చరిక కాల్ వచ్చింది. సెప్టెంబర్ 10న లండన్ కి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది.