నేరాల్లో చాలా వరకు దొంగతనాలే ఉంటాయి. చాలామంది సినిమాల్లో భారీ దొంగతనాల సీన్లు చూసి వామ్మో అంటూ ఉంటారు. అయితే నిజ జీవితంలో ఆ తరహాలో దొంగతనాలు జరగడం కాస్త అరుదనే చెప్పాలి. కానీ, సినీ ఫక్కీలో ఒక దొంగతనాన్ని యత్నం జరిగింది. డబ్బు కొట్టేసేందుకు ఏకంగా విమానాశ్రయంలోకే దూసుకెళ్లారు.
ఇటీవల పలు చోట్ల విమాన ప్రయాదాలు జరుగుతున్నాయి. గాల్లో ప్రయాణించినవారు గాల్లోనే కలిసిపోతున్నారు. కొన్నిసమయాల్లో పైలెట్ల సమయస్ఫూర్తితో అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణీకులు ప్రాణాలు రక్షిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మద్య వరుసగా అవుతున్నాయి.
సినీ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లకు అభిమానులు ఎంతో మంది ఉంటారు. ఒక్కోసారి నటులు బయటకు వచ్చినపుడు వారిని అభిమానులు చుట్టుముట్టడం చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భంగా నటీనటులు సహనం కోల్పోయి అభిమానులపై చిరాకుపడుతుంటారు.
కొంతమంది దుండగులు బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో, కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబులు పెట్టామని పోలీసులకు బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో పోలీసులు పలానా ఏరియాలో డాగ్ స్క్వాడ్స్ తో బాంబ్ కోసం వెతుకుతారు. అయితే ఎంత వెతికినా దొరక్కపోవడంతో నకిలీ ఫోన్ కాల్ అని వెనుతిరుగుతారు. గతంలో ఇలానే ఓ చార్మినార్ దగ్గర బాంబు పెట్టామని పోలీసులకు కాల్ చేసి బెదిరించారు. ఓ విమానంలో కూడా బాంబు కలకలం సృష్టించింది. అధికారులు తనిఖీలు చేసి బాంబు […]
బెంగళూరు ఎయిర్ పోర్టులో తన టీషర్ట్ విప్పించి తనిఖీలు చేశారంటూ ఓ మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు కూడా పెట్టారు. ఆ పోస్టులో ‘‘ బెంగళూరు ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్స్ సందర్భంగా నా షర్ట్ విప్పమని అన్నారు. కేవలం ఒక పెట్టికోట్‌తో సెక్యూరిటీ చెకింగ్ పాయింట్‌లో నిలబడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇలాంటి అటెన్షన్ కావాలని మహిళలుగా ఎవ్వరూ ఆశించరు. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ […]
ఒక దేశం నుంచి మరో దేశానికి బంగారం, వజ్రాలు అక్రమంగా రవాణా చేస్తున్నపుడు ఎయిర్‌పోర్టులో చిక్కటం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తరచుగా లక్షలు, కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువులు పట్టుబడుతూ ఉంటాయి. ఇదంతా ఎప్పుడూ జరిగేదే.. కానీ, కొన్ని కొన్ని సార్లు వింత, విచిత్ర, భయానక సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి మెక్సికోలోని ఎయిర్‌పోర్టులో వెలుగుచూసింది. ఓ పార్శిల్‌లో ఎకంగా నాలుగు పుర్రెలు కనిపించాయి. దీంతో అధికారులు […]
హీరో సిద్దార్థ్.. ఈ పేరుకు టాలీవుడ్ స్పెషల్ పరిచయం అక్కర్లేదు. తెలుగువాడు కాకపోయినప్పటికీ.. ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించాడు. లవర్ బాయ్ పాత్రలకు కేరాఫ్ అయిన మనోడు.. తెలుగు, తమిళ, హిందీలో ఎన్నో సినిమాలు చేశాడు. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్నాడు. సినిమాల గురించి పక్కనబెడితే.. హీరో సిద్దార్థ్ తోపాటు అతడి తల్లిదండ్రులకు ఘోర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మధురై విమానశ్రయంలో […]
హీరోగా కన్నా కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. తాజాగా వచ్చిన గాడ్‌ఫాదర్ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్రలో నటించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా.. తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం సినిమాతో డిసెంబర్ 9న విడుదలయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సత్యదేవ్.. తన జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర సంఘటనలు వివరించారు. మరీ ముఖ్యంగా ఆయనకు […]
ఈ మద్య పలు చోట్ల విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం, సాంకేతిక లోపాలు తలెత్తడంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. కొలంబియాలో ఘోర ప్రమాదం జరిగింది. 8 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఓ మినీ విమానం ఇండ్ల సముదాయాలపై కుప్పకూలిపోయింది. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగిందని కొలంబియా విమానయాన అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు […]
కొన్ని కొన్ని సార్లు జరిగే చిన్న చిన్న పొరపాట్ల వలన పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే పదాలను సరిగ్గా వినకపోయినా, అర్ధం చేసుకోవడంలో పొరపడిన కూడా అనుకోని పరిణామాలకు దారితీస్తాయి. తాజాగా కొందరు సిబ్బంది చేసిన పొరపాటు భోపాల్ విమానాశ్రయ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. బాంబు భయంతో సైరన్లు మోగించి, అత్యవసర స్థితిని విమానాశ్రయంలో ప్రకటించారు. అసలు ఏం జరిగింది? ఆ సిబ్బంది చేసిన పొరపాటు ఏమిటి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం […]