ఇజ్రాయిల్‌పై దాడులకు పాల్పడిన పాలస్తీనా టెర్రరిస్టులను గిల్బోవా జైలులో నిర్బంధించి శిక్షలు అమలుచేస్తుంది ఇజ్రాయిల్ ప్రభుత్వం. అయితే ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులు కొన్ని సార్లు అక్కడి గార్డులపై దాడికి పాల్పడుతుంటారు. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మహిళా గార్డులను ఉగ్రవాదుల మీద ఉసికొల్పుతారని, ఈ మహిళా గార్డులను వారికి ఎరగా వేసి వారి కోరికలు తీర్చమని బలవంతం చేస్తారని గత కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఓ మహిళా గార్డు తనపై జరిగిన ఆకృత్యాలను వివారించారు.
పై అధికారులు తనను బలవంతంగా రతి బానిసగా మార్చడంతో.. ఒక పాలస్తీనా ఖైదీ పదే పదే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఇజ్రాయిల్ జైలులోని మాజీ మహిళా గార్డు ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఇజ్రాయిల్ ప్రధాని యార్ లాపిడ్ స్పందించారు. దీనిపై విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. ఒక ఉగ్రవాది చేతిలో సైనికురాలు అత్యాచారానికి గురికావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రతిఘటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, బాధితురాలికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఇజ్రాయిల్‌లోని గిల్బోవా జైలులో మహిళా గార్డులపై ఖైదీలు అత్యాచారాలకు పాల్పడుతున్నారని గత కొన్నేళ్ళుగా స్థానిక మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గిల్బోవా జైలు నుంచి ఆరుగురు పాలస్తీనా ఖైదీలు డ్రైనేజీ సొరంగం ద్వారా గత ఏడాది తప్పించుకుని ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. మహిళా గార్డులని పాలస్తీనా ఖైదీలపై ఉసికొల్పుతున్న అధికారులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
JUST IN: Israeli Prime Minister @yairlapid Yair Lapid promised an investigation Sunday into allegations by a female former guard at a maximum security that she was repeatedly raped by a Palestinian inmate after being forced to work as a “sex slave” by her superiors. #Israel pic.twitter.com/V4e9XregMy
— BNN Newsroom (@BNNBreaking) August 1, 2022