చాక్లెట్స్ అంటే ఎవ్వరికి ఇష్టముండదు చెప్పండి. చిన్నారుల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ఈ తియ్యటి పదార్ధాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. చాక్లెట్ ఫ్లేవర్స్‌తో తయారయ్యే ఐస్ క్రీమ్, ఇతర పదార్థాలను కొనుగోలు చేసి తింటుంటారు.
చాక్లెట్స్ అంటే ఎవరికీ ఇష్టముండదు చెప్పండి. చిన్నారుల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ఈ తియ్యటి పదార్ధాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. చాక్లెట్ ఫ్లేవర్స్‌తో తయారయ్యే ఐస్ క్రీమ్, ఇతర పదార్థాలను కొనుగోలు చేసి తింటుంటారు. ఇక డార్క్ చాక్లెట్స్ అంటే మరింత ఇష్టం. పిల్లలకు ప్రతి రోజూ పెట్టినా లొట్టలేసుకుని లాగించేస్తుంటారు. ఏ పదార్థాన్నైనా బాక్సులో పెడితే వదిలేస్తారేమో కానీ, చాక్లెట్ పదార్థాలతో చేసిన వంటకాలను అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. పళ్లు పుచ్చిపోతాయని, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా వీటిని ఎక్కువగా తినిపించరు కానీ పిల్లల మనస్సు ఎప్పుడూ వీటి కోసం ఉబలాటపడుతోందని అనడంలో అతిశయోక్తి లేదు. వీటి కోసం మారం చేయడం, దెబ్బలు కూడా తింటుంటారు.
ఇప్పుడు అభిరుచులు మారి పెద్ద వాళ్లు కూడా చాక్లెట్స్ పై మక్కువ పెంచుకుంటున్నారు. అయితే ఇకపై తినేటప్పడు వీటిపై కన్నేయండి. లేకపోతే మీకు ఇలాంటి అనుభవాలు ఎదురుకాక తప్పదు. ఇంతకు ఏమైందనే కదా డౌట్. అయితే ఈ వార్త చదవండి. శ్రీలకంకు చెందిన ఓ మహిళ మహియాంగనాయ హాస్పిటల్‌లోని ఈసీజీ విభాగంలో పనిచేస్తుంది. ఈ నెల 3న క్యాంటీన్ (కెఫెటేరియా) విభాగంలో స్థానికంగా తయారు చేసిన చాక్లెట్ కొనుగోలు చేసి.. సగ భాగం తినేసింది. మిగిలిన భాగాన్ని ఫ్రిజ్‌లో దాచుకుంది. శనివారం మిగిలిన చాక్లెట్ తిందామని ఫ్రిజ్‌లో నుండి తీసి.. తినడం స్టార్ చేసింది. అయితే పళ్ల మధ్యలో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించింది. అయితే తొలుత నట్స్ అని భావించింది.
అయితే పళ్ల కింద ఇంకా నలగకపోవడంతో పాటు ఏదో తేడాగా అనిపించి.. బయటకు తీయగా.. వేలిని చూసింది. అది చూసి ఖంగుతినడం ఆమె వంతైంది. ఇప్పటి వరకు చాక్లెట్ తింటున్నానన్న భ్రమలో ఉన్న ఆమె ఒక్కసారిగా ఈ దృశ్యం కనబడటంతో బిత్తరపోయింది. వెంటనే ఆమె మహియాంగనాయ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు కూడా వైద్యం అందించారు. ఫిర్యాదు అందుకున్న పబ్లిక్ హెల్త్ ఇన్ స్పెక్టర్లు ఆ ప్రాంతంలోని అవుట్ లెట్లలో ఉన్న కంపెనీ చాక్లెట్లను, ఆ వేలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్లు నివేదిక సమర్పించారు. అయితే చాక్లెట్‌లోని పదార్ధం మనిషి వేలిదా? శాస్త్రీయంగా నిర్ధారించాల్సి ఉన్నందున కొలంబో లేబొరేటరీకి పంపిస్తామని పబ్లిక్ హెల్త్ ఇన్‌స్పెక్టర్ సల్మాన్ తెలిపారు.