ఈ మధ్యకాలంలో అనేక మంది వివాహితలు అదనపు కట్నం వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గచ్చిబౌలిలోని సునీత అనే వివాహిత ఆత్మహత్య కేసు మరువకముందే తాజాగా హైదరాబాద్ లోనే మరో మహిళ అదనపు కట్నం వేధింపులకు బలైంది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ ఆనంద్‌నగర్‌కు చెందిన నాగలక్ష్మి (36) బీటెక్ పూర్తి చేసింది. కొంతకాలానికి దేవరకొండకు చెందిన శ్రీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో 2015లో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాయి.
కొంత కాలం తర్వాత హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో కాపురం పెట్టారు. ఇదిలా ఉంటే పెళ్లైన నాటి నుంచి నాగలక్ష్మికి అదనపు కట్నం కోసం మెల్ల మెల్లగా వేధింపులు మొదలయ్యాయి. మొదట్లో ఇవన్నీ మాములే అనుకున్న నాగలక్ష్మి ఏళ్లు గడస్తున్న కొద్ది ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. భర్తతో పాటు అత్తమామలు సూటిపోటి మాటలతో కట్నం తీసుకు రావాలంటూ అనేక రకాలుగా తీవ్ర హింసకు గురి చేసేవారు. అయితే వీటన్నిటిని నాగలక్ష్మి తట్టుకోలేకపోయింది. ఇక నా వల్ల కావడం లేదంటూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే నాగలక్ష్మి సూసైడ్ కు ముందు.. ‘భర్తతో పాటు అత్త వేధింపులు తట్టుకోలేను.. విడిపోయి ఒంటరిగా బతకలేను… అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి’అంటూ సూసైడ్ నోట్ రాసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఒక్కసారిగా షాక్ కు గురై అత్తమామలకు వివరించాడు. వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న నాగలక్ష్మి తల్లిదండ్రులు విగతజీవిగా పడిఉన్న కూతురుని చూసి కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరించారు. అనంతరం నాగలక్ష్మి ఆత్మహత్యపై విచారణ చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇలా దేశంలో అదనపు కట్నం కోసం వివాహితలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఆత్మహత్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.