సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు చాలా తెలివైనవి. డాల్ఫిన్లు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లోతులలో డైవింగ్ చేయగలవు. సముద్రంలో ఉండే వీటిని చూడటానికి చాలా మంది ముచ్చటపడుతుంటారు. అయితే ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియో నెట్టింట ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 46 సెకన్ల నిడివి గల వీడియోలో టూర్ బోటుతో సుమారు 400 డాల్ఫిన్లు డైవ్ చేస్తూ పోటీ పడ్డాయి. దీన్ని బోటులో ఉన్న వారు ఎగబడి మరీ చూశారు. తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధిస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఇది చూడటం ఓ అదృష్టం అంటూ కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఈ వీడియోను 84.6 వేల మంది నెటిజన్లు వీక్షించగా న్యూ పోర్ట్ వేల్స్ షేర్ చేసిన వీడియోను 95 మిలియన్ల నెటిజన్లు చూడడం విశేషం. కాలిఫోర్నియాలోని న్యూపోర్టు బీచ్ తీరంలో టూరు బోటుతో పాటు సముద్రంలో 400 డాల్ఫినులు డైవ్ చేస్తూ పోటీ పడ్డాయి. సముద్రంలో డాల్ఫిన్ల పోటీ..గెలుపు ఎవరిదో అంటూ మరికొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
This is a race I would have loved to participate in…pic.twitter.com/5aPtTj4Bsp
— Harsh Goenka (@hvgoenka) June 25, 2021