నిత్యావసరాల సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలీచాలని సాలరీలతో పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, అనారోగ్య సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్నారు. వచ్చిన జీతం దేనికి సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు జీవితాన్ని సాగించడమే పోరాటంలా మారింది.
ఈ రోజుల్లో నిత్యావసరాల సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలీచాలని సాలరీలతో పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, అనారోగ్య సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్నారు. వచ్చిన జీతం దేనికి సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు జీవితాన్ని సాగించడమే పోరాటంలా మారింది. ఇక వంటింట్లో వంట నూనె ధరల గురించి తెలుసుకుందాం..
వెజిటబుల్ నూనెల దిగుమతులు జూలై నెలలో భారీగా పెరిగిపోయాయి. దీంతో నూనెల ధరలు తగ్గిపోయాయి. 17.71 లక్షల టన్నుల మేర దిగుమతులు నమోదైనట్లు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్(ఎస్ఈఏ) ప్రకటించింది. 2022 జూలై నెలలో నమోదైన 12.14 లక్షల టన్నుల దిగుమతులతో చూస్తే 46 శాతం పెరిగినట్లు తెలిపింది. 2022-23లో నవంబర్ నుండి అక్టోబర్ దిగుమతులు 23 శాతం పెరిగి 122.54 లక్షల టన్నులుగా నిల్వ ఉన్నట్లు పేర్కొంది.
వెజిటబుల్ ఆయిల్స్ వంటకు వాడేవి కాకుండా, ఆహారపదార్థాల్లో కూడా వాడేవి ఉంటాయి. ఈ సంవత్సరం జూలైలో వంట నూనెల దిగుమతులు పరిశీలిస్తే 46 శాతం పెరిగి 17.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇవి 12.05 లక్షల టన్నుల దిగుమతి అయ్యాయి. వేరే నూనెల దిగుమతులు 9,069 నుండి 15,999 టన్నులు పెరిగింది.
దేశీయ వంట నూనెల ధరలు భారీగా తగ్గడంతో డిమాండ్ కూడా భారీగా పెరిగినట్లు ఎస్ఈఏ తెలిపింది. దేశంలో వినియోగానికి సరిపడా వంట నూనెలు ఉన్నాయని.. పండుగల రోజుల్లో నూనెల సరఫరా సరిపడా ఉంటుందని ఎస్ఈఏ పేర్కొందిRu. పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుండగా, అర్జెంటీనా నుండి సోయాబీన్ ఆయిల్ ఇంపోర్ట్ అవుతోంది. పొద్దుతిరుగుడు నూనె రష్యా, ఉక్రెయిన్ నుండి దిగుమతి అవుతోంది.